ఆ వైన్ తాగితే కరోనా ఖతమేనట.. అదేంటో తెలుసా..?

0
496

కరోనా చేసిన కల్లోలం ప్రపంచం యావత్తు గుర్తుండే ఉంటుంది. 2019లో మెల్లమెల్లగా విస్తరిస్తూ 2020లో ఉగ్రరూపం దాల్చింది. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుకుంది. ఎంతో మంది పేదలను మరింత పేదరికంలోకి నెట్టడంతో పాటు లక్షలాది కుటుంబాలను రోడ్డు పాలు చేసింది. ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. దేశాల్లో అల్లకల్లోలం సృష్టించి విలయతాండం చేసింది. చైనా చేసిన ఒక్క తప్పు, యావత్ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంతో పాటు ప్రాణాపాయంలోకి నెట్టింది. తినడానికి తిండి కూడా కారువై చనిపోయిన వారు లేకపోలేదు.

వలస కష్టాలు మరిచిపోం

ఇక వలస బాధితుల రొధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పని స్థలంలో ఉండనివ్వకుండా.. చేసేందుకు పని లేకుండా.. కరువుతో కాలే కడుపుతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడారు. 2021లో కూడా కరోనా కాటు కొనసాగుతూనే ఉంది. వానాకాలం, చలికాలంలో కొంత తగ్గినా వేసవిలో మాత్ర విపరీతంగా పాకిందనే చెప్పాలి. ఇక 2022లో ఇక హాయిగా బతుకచ్చు అనుకొని సామాన్యుడు ఊపిరి తీసుకుంటుండగా, ఇటీవల కొత్త వేరియంట్ చైనాలో విజృంభిస్తుంది. దాదాపు రోజుకు లక్షకు పైగానే కేసులు నమోదవుతూ బీఎఫ్ 7 వేరియంట్ తీవ్రంగా విరుచుకుపడుతుంది.

ఈ వేరియంట్ కూడా ఓమిక్రాన్ కు సంబంధించిందని డబ్ల్యూహెచ్ఓ చెప్తుండడంతో ఇది కూడా దానిలాగే కల్లోలం సృష్టిస్తుందని అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు భారతీయ శాస్ర్తవేత్తలు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఈ వేరియంట్ తో భారత్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, కానీ జాగ్రత్తలు మాత్రం పాటించాలని సూచనలు చేస్తున్నారు.

రెడ్ వైన్ మంచిది

ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల ఒక న్యూస్ వైరల్ అవుతూ వస్తుంది. ఈ వైన్ తాగితే కరోనా ఖతం అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కొందరికి మధ్యపానం అలవాటు ఉంటుంది. అలాంటి వారు రెడ్ వైన్ తాగితే మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. రెడ్ వైన్ లో కరోనాను అంతం చేసే ఆక్సిడెంట్లు ఉంటాయట. మహమ్మారిని అడ్డుకునేందుకు ఇది దోహద పడుతుందని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో మరో హెచ్చరిక కూడా చేస్తున్నారు. కరోనా అంతం చేస్తామనే నెపంతో విపరీతంగా తాగితే మాత్రం కరోనా మాట దేవుడెరుగు.. సైడ్ ఎఫెక్స్ట్ వచ్చే ఆస్కారం ఉన్నాయంటున్నారు. ఏదైనా సరే మోతాదుకు మించి చేయవద్దని సూచిస్తున్నారు.

మోతాదుకు మించితే ప్రమాదమే

ఉపయోగం ఉంది కదా అని మోతాదుకు మించి పుచ్చుకుంటే మాత్రం శరీరంలోని వేరే అవయవాలపై ప్రభావం చూపుతుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. రెడ్ వైన్ తాగడమే కాదు. గతంలో లాగా కరోనా సూచనలు పాటించాలి. మాస్సులు ధరించడం, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచనలు చేస్తున్నారు. కరోనా కలిగించే సింప్టమ్స్ కనుక ఉంటే క్వారంటైన్ లో ఉంటూ వెంటనే వైద్యులను కలవాలి. అది సాధారణ జలుబే అయినా ఇప్పుడు వ్యాపిస్తున్న బీఎఫ్ 7 చాలా ప్రమాదకరమైనంది కాబట్టి ముందస్తు జాగ్రత్తలు అవసరం అని చెప్తున్నారు. రెడ్ వైన్ ఉపయోగాలను చెప్పిన వారికి కొందరు నెటిజన్లు కృతజ్ఞతలు చెప్తున్నారు.