కేసీఆర్‌కు సింగరేణి షాక్‌

0
367
Singareni shock for KCR

తెలంగాణ కొంగుబంగారం నల్ల బంగారం. మన దేశంలో రైల్వే తర్వాత అత్యధికమంది ఆధారపడిన రంగం ఈ సింగరేణి ఈ బొగ్గు గనులు. దీన్నే కోల్ట్‌బెల్ట్‌ ఏరియా అని కూడా అంటారు.

తెలంగాణలోని కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి, మంచిర్యాల ఆసిఫాబాద్‌, ఇల్లందు, మణుగూరు, రామగుండం, భూపాలపల్లి బెల్లంపల్లి, శ్రీరామ్‌పూర్‌ తదితర ప్రాంతాలో ఈ సింగరేణి బొగ్గు గనులు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి.
ఈ సింగరేణి ఎన్నికలు అంటే ఈ ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలకున్నంత హడావుడి ఉంటుంది.

Singareni shock for KCR

రైతు బంధులో 2 సంచలన మార్పులు?

ప్రాణాలకు తెగించి భూగర్భం నుంచి బొగ్గును వెలికితీసే కార్మికులు తమ సంక్షేమం కోసం పాటుపడే వారిని ఎన్నికల్లో గెలిపించుకోవటానికి శాయశక్తులా కృషి చేస్తారు.

తాజాగా బుధవారం సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సీపీఎం అనుబంధ సంస్థ అయిన ఏఐటీయూసీ (సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌) గుర్తింపు సంఘంగా ఘనవిజయం సాధించింది.

అలాగే రెండవ స్థానంలో నిలిచే సంఘాన్ని ప్రాతనిధ్య సంఘం అంటారు. ఈ ప్రాతనిధ్య సంఘంగా కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగం ఐఎన్‌టీయూసీ (సింగరేణి కోల్‌మైన్స్‌ లేబర్‌ యూనియన్‌) నిలిచింది.

అయితే టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో రెండు పర్యాయాలు గుర్తింపు సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) ఈ తాజా ఎన్నికల్లో అడ్రస్‌లేకుండా పోయింది.

ఎన్నికలకు ముందే ఈ సంఘానికి చెందిన కీలక నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు కాంగ్రెస్‌ జెండాలు కప్పుకున్నారు. దీంతో కవిత ఆధ్వర్యంలో 9 ఏళ్లుగా హల్‌ చల్‌చేసిన సంఘం కాస్తా చిన్నభిన్నమై కనీసం పోటీ చేయటానికి కూడా ముందుకు రాని పరిస్థితి.

దీంతో అధికారం పోయిన అతి స్వల్ప కాలంలోనే కేసీఆర్‌కు ఈ ఓటమి మింగుడు పడటం లేదు. సింగరేణిలో మొత్తం ఓటర్లు 39,773 మంది ఉండగా, 37,468 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల బరిలో నిలిచాయి.

ఇందులో 5 జాతయ కార్మిక సంఘాలు కూడా ఉండటం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ ఎన్నికల్లో మొత్తానికి కార్మికులు కేసీఆర్‌కు అసలు రాజకీయం అంటే ఏమిటో చూపించారనే సెటైర్స్‌ వినిపిస్తున్నాయి.