ఇప్పు నిప్పులు ఏడికెల్లి జమైండ్రా బై…

0
349

మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో మంచి జోష్‌కు ఆధ్యం పోసింది ఛలో రాజ్‌భవన్‌ కార్యక్రమం. పార్టీలో ఎప్పుడూ ఉప్పూ`నిప్పుగా ఉండే వర్గాలు అన్నీ ఏకమై ఖైరతాబాద్‌ జంక్షన్‌ను అల్లల్లాడిరచారు. పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. ఓ దశలో రాజ్‌భవన్‌ ముట్టడి ఖాయమనే స్థాయికి నిరసనను తీసుకెళ్లారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు చెందిన అధికారులు రాహుల్‌ గాంధీపై కేసు నమోదు చేసి, ఆయన్ను విచారించటానికి పిలిపించడంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్రంగా మండి పడుతున్నాయి.

కాంగ్రెస్‌ శ్రేణులు కదం తొక్కాయి

ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా రోడ్ల మీదకు వచ్చారు. గురువారం ఛలో రాజ్‌భవన్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో టి.కాంగ్రెస్‌ నిర్వహించిన పెద్ద కార్యక్రమం ఇదే. అయితే చాలా కాలంగా ఎటువంటి భారీ నిరసన కార్యక్రమాలు కాంగ్రెస్‌ నిర్వహించక పోవటంతో ఈ ప్రోగ్రామ్‌పై అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించలేదు. అయితే ఊహించని విధంగా కాంగ్రెస్‌ శ్రేణులు కదం తొక్కాయి.

పోలీసులకు చుక్కలు చూపించారు

కార్యకర్తలతో పాటు పీసీపీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, రేణుకాచౌదరి, భట్టి విక్రమార్క, వి. హనుమంతరావు, జగ్గారెడ్డిలతో సహా పలువురు అగ్రనేతలు రంగంలోకి దిగారు. దీంతో పోలీసులు అప్పటికప్పుడు అదనపు బలగాలను రంగంలోకి దించారు. కానీ కాంగ్రెస్‌ నేతలు బ్యాచ్‌లుగా విడిపోయి, ఒకరి తర్వాత ఒకరు రంగంలోకి వచ్చి పోలీసులకు చుక్కలు చూపించారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి పంజాగుట్ట ఎస్సై కాలర్‌ పట్టుకుని మరీ నిలదీశారు.

ఇప్పటినుంచే వేడిని రగిలించినట్లు

ఆమెను అరెస్ట్‌ చేయడానికి చుట్టూ మగ పోలీసులు వలయంలా ఏర్పడటంతో ఆమె మరింత ఫైర్‌ అయ్యారు. రేవంత్‌రెడ్డి సహా నాయకులపై 13 సెక్షన్ల కింద పోలీసులు కేసులు బుక్‌ చేశారు. మొత్తానికి వచ్చే సంవత్సరం రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్‌ ఇప్పటినుంచే వేడిని రగిలించినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.