జైలు నుండి బయటకి వచ్చిన తర్వాత స్పై బ్యాచ్ తో కలిసి పల్లవి ప్రశాంత్ ఫుడ్ పార్టీ!

0
324
After getting out of jail, Pallavi Prashant has a food party with the spy batch

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిల్చిన పల్లవి ప్రశాంత్, రీసెంట్ గానే కొన్ని దురదృష్టపు సంఘటనల కారణంగా అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన సంగతి మన అందరికీ తెలిసిందే.

అనుమతి లేకపోయినా కూడా ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ర్యాలీ చెయ్యడం తో, పోలీసులు అతని పై నాన్ బైలబుల్ సెక్షన్స్ ని విధించి చంచలగూడా జైలుకు తరలించారు. అనంతరం ఆయనకి బైలు తీసుకొని రావడానికి బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన భోలే శవాళీ చాలా కష్టపడ్డాడు.

After getting out of jail, Pallavi Prashant has a food party with the spy batch

సోమవారం లోపు పల్లవి ప్రశాంత్ బయటికి

మొత్తానికి ప్రశాంత్ ని విడిపించి సురక్షితంగా బయటకి తీసుకొని వచ్చాడు. దీనికి ప్రశాంత్ ఫ్యాన్స్ మొత్తం ఎంతో సంతోషం గా ఉన్నారు. అయితే స్పై బ్యాచ్ మళ్ళీ కలిసి అభిమానులతో లైవ్ ఇంటరాక్షన్ పెట్టుకుంటే బాగుంటుంది అని అభిమానులు కోరుకున్నారు. వాళ్ళ కోరికకు తగ్గట్టుగానే నిన్న శివాజీ ఇంట్లో ఈ ముగ్గురు కలిశారు.

ఇంస్టాగ్రామ్ లో కాసేపు లైవ్ ఇంటరాక్షన్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు శివాజీ , పల్లవి ప్రశాంత్ మరియు యావర్. వీళ్ళతో పాటుగా టేస్టీ తేజ కూడా శివాజీ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ లైవ్ లో శుభశ్రీ మరియు నయనీ పావని కూడా కనెక్ట్ అయ్యి కాసేపు అభిమానులతో ముచ్చటించారు.

ప్రశాంత్ మరియు యావర్ నాకు సొంత బిడ్డలు లాంటి వారని, బిగ్ బాస్ హౌస్ లో మా మధ్య ఏర్పడిన ఈ బంధం, చివరి శ్వాస వరకు కొనసాగుతూనే ఉంటుందని ఈ సందర్భంగా శివాజీ చెప్పుకొచ్చాడు. అనంతరం వీళ్లంతా భోలే ఇంటికి డిన్నర్ కి వెళ్లారు.

అక్కడికి నయనీ పావని మరియు శుభ శ్రీ కూడా విచ్చేసారు. అందరు కాసేపు సరదాగా గడిపి, విందు భోజనం చేసి తిరిగి ఇంటికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. వీళ్ళు కలిశారు, బాగానే ఉంది, కానీ స్పా బ్యాచ్ అనగా అమర్ దీప్, శోభా శెట్టి మరియు ప్రియాంక జైన్ మాత్రం ఇప్పటి వరకు కలుసుకోలేదు.

అమర్ తన భార్య తేజస్విని తో కలిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. శోభా శెట్టి మరియు ప్రియాంక జైన్ తమ కాబొయ్యే భర్తలతో షాపింగ్స్ కి తిరుగుతూ బిజీ గా ఉన్నారు. వీళ్ళ కలయిక ఎప్పుడు జరుగుతుందో ఏంటో చూడాలి మరి.