‘సలార్’ వెయ్యి కోట్లు అందుకోవడం అసాధ్యమేనా..?

0
504
is Salar impossible to receive a thousand crores

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ చిత్రం ఇప్పుడు మన టాలీవుడ్ మార్కెట్ ని అనుమానం పడేలా చేస్తుంది. ఈ చిత్రం వెయ్యి కోట్ల రేంజ్ వసూళ్లను అందుకోకపోతే, మన తెలుగు సినిమా స్టామినా తమిళ మార్కెట్ కంటే , అలాగే హిందీ మార్కెట్ కంటే తక్కువ అనే చెప్పొచ్చు.

నేషనల్ మీడియా కూడా ఇలాగే ప్రచారం చేస్తుంది. ఎందుకంటే మన టాలీవుడ్ నుండి రాబొయ్యే పాన్ ఇండియన్ మూవీస్ లో సలార్ ని మించిన బిగ్గెస్ట్ కాంబినేషన్ మూవీ మరొకటి లేదు. అలాంటి సినిమాకి పాజిటివ్ టాక్ మీద వెయ్యి కోట్లు కొట్టలేకపోతే, ఇక ఏ సినిమా కొడుతుంది మీరే చెప్పండి?.

తమిళ హీరోలు రజినీకాంత్ మరియు విజయ్ వంటి వారికి కేవలం సౌత్ ఇండియన్ మార్కెట్ మాత్రమే ఉంది. వీళ్ళ సినిమాలకు నార్త్ ఆడియన్స్ లో ఉన్న ఆదరణ అంతంత మాత్రమే. కేవలం సౌత్ మార్కెట్ ఉన్న వీళ్ళ గత చిత్రాలకు 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

is Salar impossible to receive a thousand crores

ఇక తగ్గించకపోతే ‘సలార్’ థియేట్రికల్ రన్ కష్టమే..!

అలాంటిది నార్త్ ఆడియన్స్ లో అంత ఫేమ్ ఉన్న ప్రభాస్ కి ఇంకెంత కలెక్షన్స్ రావాలి?, ట్రేడ్ అందిస్తున్న సమాచారం ప్రకారం ‘సలార్’ సినిమాకి హిందీలో వస్తున్న వసూళ్లు అంతంత మాత్రం గానే ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి హిందీ వెర్షన్ చేరుకోవాలంటే కనీసం 200 కోట్ల రూపాయిలు నెట్ వసూళ్లు రావాలి.

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వంద కోట్లు రావడమే ఎక్కువ అన్నట్టుగా ఉంది. ప్రతీ సినిమాకి వెయ్యి కోట్లు రావాలంటే కచ్చితంగా హిందీ మార్కెట్ నుండి అత్యధిక వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన టాలీవుడ్ మూవీస్ కి.ఎందుకంటే సౌత్ లో మన సినిమాలని తెలుగు ఆడియన్స్ తప్ప ఎవ్వరూ చూడరు.

కేవలం రాజమౌళి సినిమాలకు మాత్రమే కదులుతున్నారు. తెలుగు కాకపోతే మనకి అత్యధికంగా హిందీ నుండి వస్తేనే వెయ్యి కోట్లు సాధ్యం. ఇప్పుడు సలార్ పరిస్థితి చూస్తూ ఉంటే, వెయ్యి కోట్లు కాదు కదా, కనీసం 500 కోట్లు రాబట్టడం కూడా కష్టమే అన్నట్టుగా ఉంది.

ఈ వీకెండ్ మరోసారి బలమైన వసూళ్లను రాబట్టాలి, ఆ తర్వాత న్యూ ఇయర్ రోజు ఎంత వసూళ్లను రాబడుతుందో, దానిని బట్టే ఈ చిత్రం ఫుల్ రన్ కలెక్షన్స్ ని అంచనా వెయ్యగలం.

నైజాం మరియు ఓవర్సీస్ ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్నీ ప్రాంతాల్లో ఈ సినిమాకి కాంబినేషన్ కి తగ్గ వసూళ్లు మాత్రం రావడం లేదు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఊపుకోవాల్సిన నిజం.