వెంకీ గ్యాప్ ఇస్తున్నాడా.. తీసుకుంటున్నాడా..?

0
247

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విశిష్టనటుడు విక్టరీ వెంకటేష్. వివాదాలకు దూరంగా ఉంటూ.. తన పని తాను చేసుకుపోయే కూల్ హీరో. మల్టీస్టారర్ చిత్రాలకు దారివేసిన ఈ అగ్ర హీరో నుంచి సోలో సినిమాలు రావడం లేదు. కొత్త సినిమాల గురించి ఏమైనా అప్ డేట్ ఇస్తాడా ఎదురు చూస్తు్న్న ఆయన అభిమానులకు నిరాశే ఎదురవుతున్నది. దీంతో తమ అభిమాన హీరో బర్త్ డేన నారప్ప రిలీజ్ చేయించుకుంటున్నారు వెంకటేష్ అభిమానులు.

సెంటిమెంట్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియోన్స్లో, లవ్ స్టోరీలతో యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. వరుస విజయాలతో విక్టరీని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. రీమేక్ సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడీ దగ్గుబాటి హీరో..

మినిమం గ్యారంటీ హీరో

మినిమం గ్యారంటీ హీరోగా తన మార్కును నిలబెట్టుకున్నాడు. సినిమా తేడా కొట్టినా, పెట్టిన పెట్టుబడి తిరిగి పొందేలా ముందు ప్లాన్ చేసుకుంటాడీ విక్టరీ. సొంత బ్యానర్, డిస్ర్టిబ్యూషన్, థియేటర్లు చేతిలో ఉండడంతో రిలీజ్ కు అడ్డంకులు లేకుండా చూసుకుంటాడు. దీంతో ఈ హీరోతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుగానే ఒప్పందాలు చేసుకుంటారు.

రీమేక్ లకు కేరాఫ్ అడ్రస్

రీమేక్ చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టడంలో విక్టరీ వెంకటేష్ ను బీట్ చేసిన హీరోలెవరూ తెలుగు ఇండస్ర్టీలో లేరు.
విక్టరీ ని కెరీర్ లో నిలబెట్టిన సినిమాలు రీమేక్ లే. ఎక్కువగా తమిళం నుంచి రీమేక్ చేసినవే. టూటౌన్ రౌడీ నుంచి నిన్నటి నారప్ప దాకా ఎన్నో రీమేక్ లతో హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చంటి, చినరాయుుడు, సుందరకాండ, అబ్బాయిగారు, రాజా, సూర్యవంశం తో ఇండస్ర్టీ హిట్లు సొంతం చేసుకున్నాడు.

బొబ్బిలి రాజాతో తొలి సిల్వర్ జూబ్లీ

1986 లో తొలి చిత్రంతోనే కలియుగ పాండవులు విజయం సాధించినా కమర్షియల్ బ్లాక్ బస్టర్ మాత్రం బొబ్బిలి రాజాదే. తన తరం హీరోలు చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, సుమన్ లకు ధీటుగా సినిమాలు చేస్తూ తన కంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. బొబ్బిలిరాజాతో క్లాస్ అండ్ మాస్ హీరోగా తన మార్క్ చూపెట్టుకున్నాడు. ఈ సినిమాతో నే సిల్వర్ జూబ్లీ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత వరుస విజయాలు సాధిస్తూ.. విక్టరీ ట్యాగ్ లైన్ ను నిలబెట్టుకున్నాడు.

కూలీ నెంబర్ వన్, శత్రువు, చంటి లాంటి బ్లాక్ బస్టర్లతో తన సమకాలీకులకు ధీటుగా నిలిచాడు. ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ఒక వైపు మాస్ హీరోగా సినిమాలు చేస్తూనే చంటి, సుందరకాండ, అబ్బాయిగారు లాంటి క్లాస్ పాత్రలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. సుందరకాండ, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసి సూపర్ హిట్లు కొట్టాడు.

ఏడిపించడం ఆయనకే సాధ్యం

కుటుంబ కథా చిత్రాల్లో సెంటిమెంట్ పండిస్తూ మహిళా ఆడియెన్స్ను ఏడిపిస్తూ విజయాలు సాధించడం ఆయన కే సాధ్యమైంది. తన జనరేషన్ లో ఎక్కువ సెంటిమెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది విక్టరీ వెంకటేషే.

మల్టీస్టారర్ కూ సై

ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇగో లేకుండా మల్టీ స్టారర్ సినిమాలకు సై అనడంలో విక్టరీ వెంకటేష్ కు మించిన వారు లేరు. తన రెండో చిత్రంతోనే అప్పటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వర్ రావుతో స్ర్కీన్ షేర్ చేసుకున్నాడు. తర్వాత త్రిమూర్తులు సినిమాతో రాజేంద్ర ప్రసాద్, యాక్షన్ కింగ్ అర్జున్ తో కలిసి నటించాడు. అదే సినిమాలో సీనియర్ ఎన్టీయార్ మినహా అప్పటి హీరోలందరినీ ఒక పాటలో చూపించడం ఇప్పటికీ రికార్డే.. మళ్లీ ఇప్పటి వరకూ సౌతిండియాలోనే ఆ ప్రయత్నం చేసిన వారెవరూ లేరు.

తర్వాత సుమన్ తో కొండపల్లి రాజా, రాజాలో అబ్బాస్ తోనూ స్ర్కీన్ షేర్ చేసుకున్నాడు. మళ్లీ చాలా రోజుల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో భారీ మల్టీస్టారర్ కు అడుగులు వేశాడు. రామ్ తో మసాలా, వరుణ్ తేజ్ తో ఎఫ్2,ఎఫ్3 సినిమాలు చేశాడు.

ఓటీటీకి సై

స్టార్ హీరో అయినా నేరుగా ఓటీటీలోనూ రిలీజ్ చేసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశాడు. కరోనా కారణంగా థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో దశ్యం-2, నారప్ప సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ చేశాడు. కంటెంట్ కరెక్ట్ ఉంటే సినిమా ఎక్కడైనా ఆడుతుందని నిరూపించాడు.

కొత్త సినిమాలేవీ..?

ఎఫ్3 తర్వాత మరో సినిమా అప్ డేట్ విక్టరీ వెంకటేశ్ నుంచి రావడం లేదు. ఇటీవల విడుదలైన విడుదలైన విశ్వక్ సేన్ ఓరి దేవుడా సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. తన అన్న కొడుకు రానా తో కలిసి చేస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు టీజర్ మాత్రమే వచ్చింది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచనేది అప్ డేట్ రాలేదు. కొత్త, పాత దర్శకులనే తేడా లేకుండా కథలు వింటున్నాడే తప్ప క్లారిటీ ఇవ్వడం లేదని ఇండస్ర్టీలో టాక్.

అభిమానుల కోసమే.. వన్ డే షో

కొత్త సినిమాల అప్ డేట్ ఏమీ లేకపోవంతో విక్టరీ వెంకటేశ్ పై ఒత్తిడి ఎక్కువైంది. దీంతో విక్టరీ అభిమానులంతా నిర్మాత, వెంకటేష్ సోదరుడు దగ్గుబాటి సురేశ్ బాబు ను అప్రోచ్ అయ్యారు. ఈ మధ్య సినిమా రీ రిలీజ్ లు కూడా సూపర్ హిట్లు అవుతుండడంతో తమకూ విక్టరీ వెంకటేష్ సినిమా ఏదైనా రీ రిలీజ్ చేయాలని పట్టుబట్టడంతో నారప్ప రిలీజ్ చేసేందుకు సురేష్ బాబు ఒప్పుకున్నారు. అది కూడా ఒక్క రోజు మాత్రమే అనే షరతు పె బర్త్ డే (డిసెంబర్ 13)న విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు.