కోడలు ప్రెగ్నెంట్ అని తెలియడంతో చిరంజీవి ఏం చేశాడో

0
394

మెగా ఇంటికి బుల్లి బుడతడో.. బుడ్డదో రాబోతోంది. ఈ వార్త మెగా ఫ్యాన్స్ ను ఇంకా ఆనందంలోనే ముంచెత్తుతుంది. రామ్ చరణ్ – ఉపాసన పెళ్లయిన పదేళ్లు తర్వాత ఒక మంచి వార్తను మోసుకచ్చింది ఈ జంట. చిరంజీవి మనవడిగా, రామ్ చరణ్ తండ్రిగా ప్రమోషన్ పొందుతున్నారంటూ ఇటు చరణ్, అటు మెగాస్టార్ ఫ్యాన్స్ ఇప్పటికీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మెగా ఫ్యాన్ ప్రతి ఇంట్లో మెగా కోడలు పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇక చిరంజీవిని ఆరాధించే వారు రామ్ చరణ్ ను అన్నగా భావించే వారు కూడా ఉన్నారు. వారు సైతం తమ వదిన ప్రెగ్నెంట్ అంటూ సంతోషంగా ఫీల్ అవుతున్నారట.

మామయ్యతో గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన

రామ్ చరణ్-ఉపాసన చిన్ననాటి ఫ్రెండ్స్. వారు కలిసే చదువుకున్నారు కూడా. తర్వాత కాలేజీ డేస్ లో ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకొని విషయం ఇరువైపులా పెద్దలకు చెప్పడంతో వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివాహం తర్వాతే రామ్ చరణ్ కెరీర్ ఊపందుకుందని అదంతా వదిన ఉపాసన చలవే అంటూ మెగా ఫ్యాన్స్ చెప్పుకున్నారు కూడా.

అపోలో హాస్పిటల్స్ కు సంబంధించి కీలక బాధ్యతల్లో ఉన్న ఉపాసన కెరీర్ పరంగా రామ్ చరణ్ గురించి కూడా ఆలోచించి కొన్నాళ్లు పిల్లలకు దూరంగా ఉండాలనుకున్నారట. ఇటీవల త్రిపుల్ ఆర్ తో మంచి సక్సెస్ సాధించారు రామ్ చరణ్. ఇక ఫ్యాన్స్ తో పాటు పెద్దల గురించి ఆలోచించిన ఈ జంట పిల్లలు కనేందుకు సిద్ధమయ్యారట. ఇక తర్వాత మనకు తెలిసిందే.

మురిసిపోయిన మెగాస్టార్

ఆ హనుమంతుడి ఆశీర్వాదంతో తనకు మనుమడు లేదా మనుమరాలు రాబోతోందని చిరంజీవి ట్వీట్ చేసిన తర్వాత టాలీవుడ్ ఇండస్ర్టీ నుంచి బాలీవుడ్ ఇండస్ర్టీ వరకు సందడి మొదలైంది. చాలా మంది సినీ స్టార్లు చిరంజీవి, రామ్ చరణ్ కు శుభాకాంక్షలు చెప్పారు కూడా. ఆమె ప్రెగ్నెంట్ అని తెలియడంతో నే చిరంజీవి చేసిన పనిని ఉపాసన ఇటీవల తన ఫ్రెండ్ తో పంచుకుందట. ఈ ముచ్చట్లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి గొప్ప నటుడే కాదు. గొప్ప మనస్సున్న మనిషి అంటూ విమర్శకులు కూడా ఫిదా అవుతున్నారట.

ఫ్రెండ్ తో షేర్ చేసుకున్న ఉపాసన

‘తను ప్రెగ్నెంట్ అని తెలియగానే మామయ్య వెంటనే పూజగదిలోకి వెళ్లి తన ఇష్టదైవం హనుమంతుడికి పూజలు చేశారు. ఆంజనేయుడి సింధూరాన్ని తెచ్చి తన నుదిటిపై పెట్టి ఆశీర్వదించారు. ఆ సమయంలో చాలా ఎమోషనల్ అయ్యారు మామయ్య. ఆ సమయంలో మామయ్య పడినంత ఆనందం మా నాన్న కూడా పడరేమో అనిపించింది.’ తన ఫ్రెండ్ కు ఉపాసన చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ఇంత కాలం రామ్ చరణ్ తండ్రి కాలేదని తన ఫ్యాన్స్ విమర్శలు గుప్పించినా చిరంజీవి మాత్రం ఈ విషయంపై ఎప్పుడూ కొడుకు, కోడలిని అడగలేదట. పైగా వారి జీవితం ఏవిధంగా ప్లాన్ చేసుకున్నారో అంటూ వారి నిర్ణయాన్ని వారికే వదిలేశారట. సోషల్ మీడియా లో బూతులు కూడా తిట్టారు. ఆ తరువాత మెగాస్టార్ మనస్సు తెలుసుకున్న వారు దణ్ణం పెట్టక మానరు కదా.