దాని కోసం కోట్లు ఖర్చు పెట్టిన హీరోయిన్లు

0
582

రంగుల ప్రపంచంలో గ్లామర్ చాలా ముఖ్యం. ఒక్కసారి గ్లామర్ పోయిందా.. అంతే ఆ హీరోయిన్ ను క్యారెక్టర్ ఆర్టిస్టుగా తీసుకునేందుకు కూడా దర్శకులు, ప్రొడ్యూసర్లు ఇష్టపడరు. ఇది రంగుల ప్రపంచం ఇందులో అన్నీ ఇలానే ఉంటాయి. ఇక్కడ ఎక్కువ కాలం నిలబడాలంటే గ్లామర్ చాలా ముఖ్యం. టాలెంట్ ఎంత ఉన్నా గ్లామర్ లేకపోతే మాత్రం వెనుక బడాల్సిందే. అలనాటి సావిత్రికి కూడా ఈ తిప్పలు తప్పలేదు. అందంగా ఉన్న సమయంలో క్యూ కట్టిన ఆఫర్లు ఆమె కొంచెం లావయినతర్వాత తగ్గాయి. ఎలాగోలా చిత్ర సీమతోనే తను చివరి వరకూ ప్రయాణం కొనసాగించాలనుకున్న సావిత్రి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కొన్ని చిత్రాల్లో నటించారు.

ఇక్కడ ఇంతటి విలువ ఉన్న అందం కాపాడుకునేందుకు హీరోయిన్లు కోట్లు ఖర్చు పెడతారు. తప్పదు మరి ఈ ఫీల్డ్ అంటే ఇలాగే ఉంటుంది. వ్యాయామాలు, మేకప్, ఇది చివరికి సర్జరీల వరకూ వెళ్లిన సందర్భాలు లేకపోలేదు. అలా ఒక హీరోయిన్ చనిపోయిన సందర్భం కూడా ఉంది. అతిలోక సుందరి శ్రీదేవి నుంచి నేటి తరం యంగ్ హీరోయిన్ల వరకూ శరీరంలో అందంగా కనిపించని ఏదో ఒక భాగానికి సర్జరీలు కూడా చేయించుకున్నారు. అలాంటి వారి గురించి తెలుసుకుందాం.

శ్రీదేవి

అతిలోక సుందరి అంటే ఠక్కున చెప్పే పేరు శ్రీదేవి. ఆమె అందం గురించి మాట్లాడడం అసాధ్యమే చెప్పాలి. ఎంతో మంది యంగ్ హీరోలు కూడా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి లేదు. ఇక ఆమె శరీరంలో ముక్కు సరిగా లేదని దీంతో అందం దెబ్బతింటుందని భావించిన ఆమె ఏకంగా రూ. 2 కోట్లు ఖర్చు పెట్టి మరీ సర్జరీ చేయించుకున్నారట.

సమంత

ప్రస్తుతం లేడీ పాన్ ఇండియాగా గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత. మొదటి చిత్రంతో ఇండస్ట్రీని తనవైపునకు తిప్పుకున్న ఆమె అనేక చిత్రాలతో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. కానీ తన శరీరంలో తన పెదవులు బాగా లేవని భావించిన ఆమె రూ. కోటితో పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వినిపించాయి.

శ్రీయ

‘ఇష్టం’తో ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీయా శరన్ చాలా చిత్రాల్లో నటించి మెప్పించారు. అప్పట్లో ఆమెకు శ్రీదేవి రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది. ఆమె అందానికి తోడు అభినయం బాగా వర్కవుట్ అయ్యేది. అయితే ఆమె పెదవులు బాగా లేవని అనుకొని రూ. 3 కోట్ల వరకూ ఖర్చు చేసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట.

త్రిష

త్రిష తన ముక్కు బాగా లేదని దీంతో అందం దెబ్బతింటుందని భావించి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని అందుకు ఆమె ఏకంగా రూ. 3కోట్ల వరకూ ఖర్చు పెట్టిందట.

శృతి హాసన్

విశ్వ నటుడు కమల్ హాసన్ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతీ హాసన్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె అందంపై బాగా కేర్ తీసుకుంటారట. తన అందానికి ముక్కు సరిపోలేదని మార్చుకోవాలని అనుకున్న ఆమె రూ. 3కోట్లకు పైగా ఖర్చు పెట్టి సర్జరీ కూడా చేయించుకున్నారట.

నయనతార

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న నయన తార కూడా తన గ్లామర్ ను కాపాడుకునేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందట. ఆమె లైపో సెక్షన్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందన్న విషయం చాలా మందికి తెలియదు. దీతని కోసం ఆమె ఏకంగా రూ. 4కోట్లు ఖర్చు పెట్టింది.