మీనా రెండో పెళ్లి చేసుకుంటుందా?

0
320

దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు వెండితెరపై నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి మీనా. బాలనటి నుంచి వెండితెర హీరోయిన్ గా ఆమె ఎంతో మంది అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసింది. ఆమె తన ప్రొఫెసన్ నుంచి కాకుండా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి విద్యాసాగర్ ను వివాహం చేసుకొని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఆమె భర్త గుండెపోటుతో మరణించాడు. దీంతో ఆమె తీవ్ర డీప్రెషన్ కు లోనైంది. ఇటీవలే కొంచెం తేరుకొని షోలలోకి ఎంట్రీ ఇస్తుంది.

దంపతులను విడదీసిన కొవిడ్

ఆనందంగా కలిసి ఉన్న మీనా, విద్యాసాగర్ ను కొవిడ్ విడదీసింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన విద్యా సాగర్ కు కొవిడ్ సోకింది. చికిత్స అనంతరం ఆయన బాగానే ఉన్నా.. వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తడం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే గుండెపోటుతో ఆయన మరణించినట్లు తెలుస్తుంది. పోస్ట్ కొవిడ్ తోనే ఆయన లోకాన్ని విడిచి వెళ్లిపోయాడని అప్పట్లో ప్రకటించారు. ఆయన మరణంతో కుంగిపోయిన మీనా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఆమె సహ నటులు కూడా అండగా ఉంటూ ధైర్యం చెప్తూ డీప్రెషన్ నుంచి బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు.

ఇప్పుడిప్పుడే షోలకు

భర్త మరణంతో డీప్రెషన్ లోకి వెళ్లిన మీనా ఇప్పుడిప్పుడే కోలుకొని షూటింగ్స్ కు హాజరవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె రెండో పెళ్లికి సిద్ధమయ్యారన్న వార్త తెలుగు ఇండస్ర్టీలో జోరుగా ప్రచారం అవుతుంది. మీనాకు ప్రస్తుతం 46 సంవత్సరాలు ఉంటాయి. ఆమె జీవితంలో ఒక చిన్నారి కూడా ఉంది. మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆమె కుటుంబ సభ్యులు సూచనలు చేస్తున్నారంట. రెండో పెళ్లి చేసుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. వారి బలవంతం మేరకు ఇటీవల ఆమె ఒప్పుకున్నట్లు వస్తున్న వార్త తెగ వైరల్ అవుతోంది.

చిన్నారి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని

మీనా-విద్యాసాగర్ దంపతులకు ఒక కూతురు ఉంది. చిన్నారి భవిష్యత్ దృష్ట్యా తను ఇంకో పెళ్లి చేసుకొని తీరాలని కుటుంబ సభ్యులు పట్టుబడుతున్నాట. కానీ మీనాకు మాత్రం రెండో పెళ్లి ఇష్టం లేనది వారిని చాలా రోజుల నుంచి వారిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వారు మాత్రం అదే చెప్తూఉన్నారట. దీంతో చేసేదేం లేక రీసెంట్ గా ఆమె కూడా ఒప్పుకుదన్న వార్త ఇప్పుడు ఇండస్ర్టీలో వినిపిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం ఒక వరుడిని కూడా చూచించారట.

ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు

తమ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తిని చేసుకోవాలని ప్రపోజల్ పెట్టారట. అతని గురించి మీనాకు ముందే తెలుసు కాబట్టి ఆమె కూడా అడ్డు చెప్పలేదని పెళ్లికి సిద్ధమైందని సినీ ఇండస్ర్టీ చెప్తోంది. ఐతే దీనిపై మీనా కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇటు అభిమానులు మాత్రం మనిషికి తప్పనిసరిగా మరో మనిషి తోడు అవసరం అవుతుందని సూచిస్తున్నారు. ఏది ఏమైనా మీనా ఒంటరిగా కాకుండా మరో పెళ్లి చేసుకొని తన సెకండ్ లైఫ్ ను ఆనందంగా గడపాలని కోరుకుందాం.