రాజమౌళి కి 9 ఏళ్ళ డేట్స్ కేటాయించిన సూపర్ స్టార్ మహేష్ బాబు!

0
391
Superstar Mahesh Babu assigned 9-year dates to Rajamouli

సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు ఈ ఏడాది లో ఒక్క సినిమా కూడా విడుదల చెయ్యలేదు. కానీ ఈ సంక్రాంతికి ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి చేసిన ‘గుంటూరు కారం’ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఇప్పుడు గుంటూరు కారం కి సంబంధించిన పాటలే వినిపిస్తున్నాయి.

Superstar Mahesh Babu assigned 9-year dates to Rajamouli

ప్రభాస్ ఒక్క డిన్నర్ కోసం చేసే ఖర్చు తో 100 మంది తినొచ్చు తెలుసా!

టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ మూవీ టీజర్ ని దాదాపుగా నాలుగు కోట్ల మంది వీక్షించారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

#RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం తో ఈ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. #RRR కారణంగా రాజమౌళి కి హాలీవుడ్ లో కూడా మార్కెట్ వచ్చింది.

జేమ్స్ కామెరాన్ వంటి వారు కూడా రాజమౌళి ని పొగడ్తలతో ముంచి ఎత్తారు. కాబట్టి ఆయన తర్వాత చెయ్యబొయ్యే సినిమా కచ్చితంగా బాహుబలి సిరీస్ మరియు #RRR కి మించే ఉండాలి.

అందుకే ఇప్పటివరకు ఇండియన్ మేకర్స్ ఎవరు ముట్టుకొని ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ జానర్ ని ఎంచుకున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ చాలా పెద్దది కావడం తో మూడు భాగాలుగా తెరకెక్కిస్తారని ఫిలిం నగర్ లో ఎప్పటి నుండో ఒక టాక్ ఉంది.

అందులో కేవలం మొదటి భాగం తెరకెక్కించడానికి మూడేళ్ళ సమయం పడుతుందట. ఇక మిగిలిన భాగాలు తెరకెక్కించడానికి మరో ఆరేళ్ళు. అంటే 9 ఏళ్ళు మహేష్ ఈ సినిమా కోసం డేట్స్ ఇవ్వాలి అన్నమాట. 9 ఏళ్ళు అంటే ఇద్దరు ఈ సినిమా పూర్తి చేసి రిటైర్ అయిపోవచ్చు అన్నమాట.

మరి మహేష్ ఫ్యాన్స్ కేవలం ఒక్క ప్రాజెక్ట్ కోసం ఇన్నేళ్ల సమయం ని కేటాయించడం ని ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. వాళ్ళు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మహేష్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది కాబట్టి, కచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే.