నాగశౌర్య భార్య అనూష బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. షాక్ అవ్వాల్సిందే..

0
255

యంగ్ హీరో నాగశౌర్య ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో ఇండస్ర్టీకి పరిచయం అయ్యాడు. తన కేరీర్ లో ఒకటి, రెండు హిట్లు తప్ప ఎక్కువగా ప్లాపులే ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఆయనకు వివాహం జరిగింది. చాలా దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో సాదాసీదాగా నిర్వహించుకున్నాడు. బెంగళూర్ కు చెందిన అనూష శెట్టి మెడలో మూడు ముళ్లు వేశాడు నాగశౌర్య. ఇంత సాదాసీదాగా పెళ్లి చేసుకున్నా ఆయన హైదరాబాద్ లో రిషెప్షన్ ఏర్పాటు చేస్తున్నాడు. దీనికైనా టాలీవుడ్ పెద్దలను పిలుస్తాడో లేదో చూడాలి.

షూటింగ్ కోసం బెంగళూర్ కి వెళ్లి

ఇక అనూష శెట్టి గురించి తెలుసుకుంటే బెంగళూర్ లో మంచి గుర్తింపు ఉన్న ఇంటీరియర్ డిజైనర్. తనే సొంతంగా ఒక కంపెనీ ప్రారంభించి అనతి కాలంలో టాప్ పొజీషన్ లో నిలిచింది. సినీ ఇండస్ర్టీకి చెందిన చాలా మంది స్టార్స్ హోం కన్ స్ర్టక్చన్ ఆమె సూచనల మేరకే నిర్మించారంటే సందేహం లేదు. ఐతే ఒక చిత్ర షూటింగ్ కోసం బెంగళూర్ కి వెళ్లిన నాగశౌర్య అనూష ను చూసి మనసు పారేసుకున్నారంట. ఇక పెద్దలను ఒప్పంచి పెళ్లి తంతు వరకూ తీసుకచ్చారు అనూ-నాగశౌర్య.

అనూష తన లైఫ్ లోకి వచ్చింది కాబట్టి

నాగశౌర్య తన సొంత నిర్మాణ సంస్థలో ఇటీవల తీసిన ‘కృష్ణ వ్రిందా వివాహారి’ హిట్ కొట్టింది. చాలా కాలం తర్వాత హిట్ రావడంతో తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఆయన చేతిలో -నారి నారి నడుమ మురారీ’, ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’, ‘పోలీస్ వారి హెచ్చరిక’ ప్రాజెక్టుకులలో నటిస్తున్నాడు. వీటితో తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఆయన చెప్తున్నాడు. అనూష తన లైఫ్ లోకి వచ్చింది కాబట్టి అంతే బాగుంటుందని అంటున్నాడు నాగశౌర్య.