సంక్రాంతి బరిలో చతికిలపడ్డ మన హీరోలు

0
4572

సంక్రాంతి పండుగ సినీ ఇండస్ట్రీకి వసూళ్లను తెచ్చిపెడుతుంది. ఇది ఆది నుంచి కొనసాగుతూనే ఉంది. గతంలో కొంత మంది స్టార్లు ప్రతీ సంక్రాంతి ఒక సినిమా ఉండేలా ప్లాన్ చేసుకునే వారు. అంతలా వారికి ఈ పండుగ కలిసి వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ సంక్రాంతి బరిలో 30 సినిమాలను నిలిపి హిట్ల మీద హిట్లు సాధించి రికార్డులను నెలకొల్పాడు. కాగా సీనియర్ ఎన్టీఆర్ కూడా 28 చిత్రాలను సంక్రాంతి కానుకగా అందజేశారు.

సంక్రాంతి మంచి సెంటిమెంట్

ఇక ప్రస్తుతం తరం నటులను తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా చాలా మంది హీరోలకు సంక్రాంతి మంచి సెంటిమెంట్. కానీ వారి సెంటిమెంట్ రివర్స్ అయ్యింది. ప్రతీ సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరోల సినిమాలు కూడా డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.

2019లో సంక్రాంతి కానుక

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ 2019లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. కానీ భారీ డిజాస్టర్ ను ఎదుర్కొనవలసి వచ్చింది. ఇందులో నటించిన కియారా అద్వానీ చాలా కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూడలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సినిమా ‘అజ్ఞతవాసి’. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేశారు. కానీ ఇది డిజాస్టర్ గా మిగిలిపోయింది. వీరి కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది లాంటి సినిమాలు భారీ సక్సెస్ సాధించగా.. అజ్ఞతవాసి మాత్రం డిజస్టర్ గా మిగిలింది.

2001లో సంక్రాంతికి

మహేశ్ బాబు సినీ కెరీర్ లోనే డిఫరెంట్ సినిమాగా చెప్పుకునేది ‘నేనొక్కడినే (వన్)’. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను 2014లో సంక్రాంతి బరిలో నిలిపారు. కానీ డిజాస్టర్ గా మిగిలింది. అయినా ఈ మూవీ మహేశ్ బాబును హాలీవుడ్ స్టార్ల సరసన నిలిపేందుకు సహకరిస్తుందనే వాదనలు అప్పట్లో బాగా వినిపించాయి. మెగాస్టార్ చిరంజీవి, గుణ శేఖర్ కాంబోలో వచ్చిన ‘మృగరాజు’ 2001లో సంక్రాంతికి రిలీజైంది. అయితే టాక్ ఎలా ఉన్నా ఈ మూవీ మాత్రం డిజాస్టర్ గానే మిగిలింది. దీంతో పాటు కోడి రామకృష్ణ తో కలిసి చేసిన ‘అంజి’ కూడా డిజాస్టర్ గానే మిగిలింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూరి కాంబోలో వచ్చిన ‘ఆంధ్రావాలా’ 2004 సంక్రాంతి బరిలో నిలిచింది. మాస్ యాంగిల్ లో సాగిన ఈ చిత్రం ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించినా ఆడియన్స్ కు మాత్రం అస్సులు కనెక్టు కాలేకపోయింది. దీంతో డిజాస్టర్ గా మిగిలింది.

2008లో రిలీజై డిజాస్టర్

రెబల్ స్టార్ ప్రభాస్, వీవీ వినాయక్ కాంబోలో వచ్చిన ‘యోగి’ 2007లో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. నటసింహం, యువరత్న బాలకృష్ణ నటించిన సినిమాలలో వరుసగా మూడు సంక్రాంతికి రిలీజై డిజాస్టర్లుగా మిగిలాయి. బాలకృష్ణ, వైవీఎస్ చౌదరి కాంబోలో వచ్చిన ‘ఒక్కమగాడు’ 2008లో రిలీజై డిజాస్టర్ గా నిలిచింది. తర్వాత 2011 సంక్రాంతికి వచ్చిన ‘పరమ వీరచక్ర’ కూడా బోల్తా కొట్టింది. 2016లో వచ్చిన ‘డిక్టేటర్’ కూడా డిజాస్టర్ గా మిగిలింది.