బాలయ్య రికార్డులను బ్రేక్ చేసిన మెగాస్టార్

0
1245

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన పెద్ద స్టార్ల చిత్రాలు ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’. వీరసింహారెడ్డిలో బాలకృష్ణ హీరోగా చేయగా, వాల్తేరు వీరయ్యలో చిరంజీవి హీరోగా చేశారు. రెండు భారీ చిత్రాలు కూడా ఒకే ప్రొడక్షన్ బ్యానర్ పై రిలీజ్ అయ్యాయి. దీంతో తెలుగు రాష్ర్టాల్లోని థియేటర్లు ఫ్యాన్స్ తో సందడి చేస్తున్నాయి. ఇటు మెగాస్టార్ చిరంజీవి మెగా అభిమానులు, అటు బాలయ్య బాబు అభిమానులు ఇలా థియేటర్లు ఈలలు, గోలలతో నిండిపోయాయి. సీనియర్ హీరోల ఊరమాస్ సినిమాలు కావడంతో అభిమానులు పూనకాలెత్తిపోతున్నారు.

వసూళ్లును రాబడుతున్న రెండు సినిమాలు

సంక్రాంతి బరిలోకి ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలతో దిగడంతో ఇరువైపులా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. వీరసింహారెడ్డి పౌరుషం, వాల్తేరు వీరయ్య కామెడీ టైమింగ్స్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా పోటా పోటీగా రన్ అవుతున్నాయి. టాలీవుడ్ ఆడియన్స్ అంతా థియేటర్లలోనే ఉండిపోతున్నారు. తమ అభిమాన మాస్ హీరోల ట్రీట్ తో పూనకాలెత్తిపోతున్నారు. ఈ 2 సినిమాలు కూడా తొలి రోజు పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేశాయనే చెప్పాలి. నైజాం, ఆంధ్ర, సీడెడ్ తో పాటు అన్ని ఏరియాల్లో ప్రీమియర్స్ ఫుల్ సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో యూఎస్ లో రెండు చిత్రాలు విడుదల కాగా బాలకృష్ణ వీరసింహా రెడ్డిపై, మెగాస్టార్ వాల్తేరు వీరయ్య రికార్డు సాధించింది.

యూఎస్ లో వాల్తేరు టాప్

వాల్తేరు వీరయ్య వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో భారీ స్పందన వచ్చింది. ఒక్క ప్రీమియర్స్ ద్వారానే 638 కే డాటర్లను వసూలు చేసింది. ఇక తొలిరోజు 274కే వసూలు చేసింది. మొత్తంగా చూస్తే తొలి రోజు 900 కే డాలర్లు వచ్చినట్లు అధికారికంగా తెలిపారు. ఇక బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రీమియర్స్ ద్వారా 708 కే డాలర్లు వచ్చాయి. అయితే మొదటి రోజు కలెక్షన్ కాస్త డ్రాప్ పావడంతో ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి 800 కేు డాలర్లకే పరిమితమైంది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి చూస్తే 900 కే డాలర్లతో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిపై అటాక్ చేసిందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో పాటు రెండు తెలుగు రాష్ర్టాలే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా వాల్తేరు వీరయ్య విజృంభన కొనసాగుతుంది.

పైచేసి సాధించిన చిరంజీవి

చిరంజీవి హీరోగా చేసిన ‘వాల్తేరు వీరయ్య’కు బాబీ డైరెక్టర్ గా వ్యవహరించారు. హీరోయిన్ గా శృతి హాసన్ నటించారు. శృతి హాసన్ వీరసింహారెడ్డితో కూడా కలిసి నటించడం విశేషం. ఇక వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి స్ర్కీన్ ను పంచుకున్నారు మాస్ మహరాజ్ రవితేజ. రాజేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ స్టార్లు కూడా ఉండడంతో వాల్తేరు వీరయ్య మంచి కమర్షియల్ హిట్ అయ్యింది. చిరంజీవి సూచించిన తేదీ మేరకే 13 జనవరి (శుక్రవారం) దీన్ని రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. బాలయ్య బాబుతో పోటీ పడిన చిరంజీవి ఈ సారి పైచేయి సాధించారనే చెప్పవచ్చు.