సంక్రాంతి మొనగాడు ఆ హీరోనే.. 30 సీనిమాలు హిట్

0
868

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటేనే సందడి చేసే పండుగ. సాధారణ ప్రజలకే కాకుండా సినీ ఇండస్ట్రీకి కూడా పెద్ద పండుగనే చెప్పాలి. సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద చిత్రాలను నిలిపేందుకు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తహ తహ లాడుతుంటారు. ఒక సంక్రాంతికి ఒక సినిమా హిట్ కొట్టి వాసూళ్లను రాబట్టిదంటే ఇదే తరహా హిట్లు కొడుతుంటారు హీరోలు. ఈ కోవలో టాప్ లిస్ట్ లో ఉన్నారు సూపర్ స్టార్ కృష్ణ. సంక్రాంతి హీరోగా కూడా టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. ఏ హీరోకు సాధ్యం కాని రికార్డులను నెలకొల్పారు.

అసాధ్యం ఎరుగని హీరో సూపర్ స్టార్ కృష్ణ

ఇండస్ట్రీలో ఏ హీరోకు సాధ్యం కాని సంక్రాంతి సెంటిమెంట్ ఒక్క సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సాధ్యమైంది. అత్యంత ఎక్కువ సినిమాలు సంక్రాంతి వేడుకగా రిలీజ్ చేశారు కృష్ణ. మొదట ఆయన సంక్రాంతికి ‘అసాధ్యుడు’ సినిమాను రిలీజ్ చేశారు. ఆనాటి నుంచి ప్రతీ సంక్రాంతికి ఆయన రిలీజ్ చేసిన సినిమా సూపర్ డూపర్ హిట్టవడమే కాకుండా భారీగా వసూళ్లను కూడా రాబట్టింది. ప్రతీ సంక్రాంతికి తన చిత్రం ఉండేలా ప్లాన్ చేసుకున్నారు కృష్ణ. ఆయన ప్లాన్ సెంటిమెంట్ బాగా కలిసి వచ్చి ఇండస్ట్రీలో దూసుకెళ్లిపోయారు.

సంక్రాంతి కానుకగా 30 సినిమాలు

సూపర్ స్టార్ కెరీర్ లో 30 సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజై ఆడియన్స్ ను, ఆయన ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. కృష్ణ సినిమాలో అసాధ్యుడు బిగ్ హిట్ అనే చెప్పాలి వసూళ్లలో అది ఒక బ్రేక్ ఈవెన్ అంటే సందేహమే లేదు. 12 జనవరి, 1968లో రిలీజైంది. ఈ సినిమా ఆయనకు 11వ సినిమా. సంక్రాంతికి రిలీజైన్ ఈ మూవీ వంద రోజుల పండుగ చేసుకుని మరీ ముందుకు సాగింది. అప్పటి నుంచి కృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ ప్రారంభమైంది. ప్రతీ సంక్రాంతి రోజు తన చిత్రం ఒకటి ఉండేలా ప్లాన్ చేసుకోవడం ప్రారంభించాడు.

ఎన్టీఆర్ తో పోటీ ఆయనకంటే రెండు చిత్రాలు ఎక్కువే

సెంటిమెంట్ ను కొనసాగిస్తూ వస్తున్న సూపర్ స్టార్ కృష్ణ దాదాపు 30 చిత్రాలను సంక్రాంతి బరిలో నిలిపి వందల రోజుల పండుగలు జరుపుకుంటూ విజయ పరంపర కొనసాగించారు. ఇక ఆయన సమకాలీయ నటుడు నందమూరి తారక రామారావు కూడా సంక్రాంతి బరిలో 28 చిత్రాలను ఉంచారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ మరో రెండు చిత్రాలను అదనంగా నిర్మించి రికార్డును నెలకొల్పారు. కొన్ని సార్లు ఎన్టీఆర్ తో సంక్రాంతి బరిలో తలపడ్డాడు సూపర్ స్టార్ కృష్ణ.

సంక్రాంతి మొనగాడిగా గుర్తింపు

ప్రతీ సంక్రాంతికి ఎన్టీఆర్ కుటుంబ కథలను ఎంచుకుంటే సూపర్ స్టార్ మాత్రం ప్రయోగాలను కూడా ఎంచుకున్నాడు. జేమ్స్ బాండ్ లాంటి చిత్రం ‘గూఢచారి 116’ కూడా సంక్రాంతి బరిలో నిలిపి ఫ్యామిలీ ఆడియన్స్ ఆ చిత్రం చూసేలా చేశారు సూపర్ స్టార్. తన కెరీర్ లో 350కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ. అందులో 30 చిత్రాలు సంక్రాంతి రోజే విడుదల చేశారు. అందులో కూడా దాదాపు అన్నీ హిట్లు కావడం విశేషం. దీంతో ఆయనకు సంక్రాంతి మొనగాడు అన్న ముద్ర కూడా పడింది.

1968లో అసాధ్యుడు తర్వాత 1973లో ‘మంచి వాళ్లకు మంచి వాడు’, 1976లో ‘పాడి పంటలు’; 1977లో ‘కురుక్షేత్రం’, 1978లో ‘ఇంద్రధనుస్సు’, 1980లో ‘భలే కృష్ణుడు’, 1981లో ‘ఊరికి మొనగాడు’, 1983లో ‘బెజవాడ బెబ్బులి’, 1984లో ‘ఇద్దరు దొంగలు’, 1985లో ‘అగ్ని పర్వతం’, 1987లో ‘తండ్రీ కొడుకుల ఛాలెంజ్’, 1988లో ‘కలియుగ కర్ణుడు’, 1989లో ‘రాజకీయ చదరంగం’, 1990లో ‘ఇన్ స్పెక్టర్ రుద్ర’, 1992లో ‘పరమ శివుడు’, 1993లో ‘పచ్చని సంసారం’, 1994లో ‘నవంబర్ వన్’, 1995లో ‘అమ్మ దొంగా’. ఇలా సంక్రాంతి బరిలో చిత్రాలను నిలుపుకుంటూ వెళ్లారు సూపర్ స్టార్ కృష్ణ.