చరణ్ కు అబ్బాయే పుట్టాలి.. ఫ్యామిలీ కామెంట్స్

0
695

రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. గతేడాది చివరలో చిరంజీవి ఈ న్యూస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. రామ్ చరణ్ కు 2012లో వివాహం జరగగా పిల్లలు కలుగలేదు. దీనికి కూడా కొన్ని కారణాలు లేకపోలేదు.

కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో పిల్లలను కంటే ఇబ్బందులు ఎదురవుతాయని దంపతులు ఇద్దరూ అనుకున్నారు కాబట్టి పిల్లలు కనలేదు. కానీ ఇరు కుటుంబాల నుంచి, మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఒత్తిడిని అర్థం చేసుకున్న వారు పిల్లలు కనేందుకు సిద్ధమయ్యారు. దీంతో 2022లో చివరలో ఉపాసన ప్రెగ్నెంట్ అయిన విషయం సోషల్ మీడియాను ఒక్క కుదుపు కుదిపింది.

ఇంటిళ్లిపాది సందడి

మొదట తన దేవుడు వీరాంజనేయ స్వామికి పూజలు చేసిన చిరంజీవి. తన ఇంటికి వారసుడు లేదా వారసురాలు రాబోతుందన్న విషయాన్ని ప్రకటించారు. ఎవరు వచ్చినా తన పోస్ట్ పెరుగుతుందని అన్నారు చిరంజీవి. రామ్ చరణ్-ఉపాసన ఇన్నాళ్లకు గుడ్ న్యూస్ చెప్పారని ఆనందంతో తబ్బిబయ్యారు మెగాస్టార్. బాలీవుడ్ నుంచి స్టార్ హీరోలు కూడా రామ్ చరణ్ కు విషెశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో తమ పుట్టింట్లోకి ఆడపిల్ల కాకుండా మగ పిల్లాడు రావాలని కోరుకుంటుంది రామ్ చరణ్ సోదరి సుష్మిత.

రామ్ చరణ్ అక్క మనసులోని మాట

రామ్ చరణ్ సోదరి (అక్క) తన మనసులోని మాటలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పటికే పుట్టింట్లోకి నలుగురు ఆడపిల్లలు వచ్చారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు కాగా, నా చెల్లి శ్రీజకు కూడా ఇద్దరు ఆడపిల్లలు. ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం విన్నప్పటి నుంచి చాలా ఆనందంగా ఉన్నాం. ఎవరు పుట్టినా మాకు ఓకే కానీ ఇప్పటికే నలుగురు ఆడ పిల్లలు ఉన్నారు కాబట్టి చరణ్ కు బాబే పుట్టాలని నేను కోరుకుంటున్నా అన్నారు సుష్మిత. సుష్మిత కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రొడ్యూసర్ గా, క్యాస్టూమ్ డిజైనర్ గా ఆమె బాగా రాణిస్తున్నారు.

వరస ప్రాజెక్టులతో చరణ్ బిజీ

ఇక చరణ్ విషయానికి వస్తే ‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ రికగ్నషన్ అవార్డును చరణ్ అందుకున్నాడు. ఆయనకు హాలీవుడ్ లో నటించే అవకాశాలు కూడా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. దీనితో పాటు మరో ఐదు ప్రాజెక్టులకు కూడా చర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శంకర్ సినిమా ముగిసిన వెంటనే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో తీసే సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

వీటికి తోడు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ను దర్శకుడు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి చాలా సమయమే పట్టేలా ఉంది. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబుతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. ఇది ముగిసిన వెంటనే సీక్వెల్ ప్రారంభిస్తారని తెలుస్తుంది.

కాగా రాంచరణ్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఒక పక్క చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చినా.. తనదైన కష్టంతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ పడిన కష్టాన్ని రాజమౌళి ఎంతగానో కొనియాడారు. తండ్రి అంత పెద్ద స్టార్ అయినా.. తన సొంత నిర్ణయాలు తీసుకొని పైకి వచ్చాడని రాజమౌళి తెలిపారు.