రజనీకాంత్ జీవితాన్ని మార్చింది ఆ అమ్మాయే

0
516

రజనీకాంత్ ఈ పేరుకు దేశ వ్యాప్తంగా.. అంతెందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అక్కర్లేదు. ఆయన సాధించిన రికార్డుల్లో కొన్ని ఇప్పటికీ ఎవ్వరూ బ్రేక్ చేయలేపోతున్నారంటే ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచి బయటకు వచ్చిన శివాజీ రాజ్ గైక్వాడ్ (రజనీకాంత్ అసలు పేరు) రాజనీకాంత్ గా మారే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.

సినిమాల్లోకి వచ్చిన ఆయన మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా, తర్వాత విలన్ గా, తర్వాత సూపర్ స్టార్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ప్రస్తుతం ఇండస్ర్టీకి వచ్చిన హీరోల్లో ఆయన ఫ్యాన్సే ఎక్కువగా ఉన్నారు. ఏడు పదుల వయస్సులో కూడా వారికి గట్టి పోటీ ఇస్తున్నారంటే సూపర్ స్టార్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

రజనీకాంత్ ను దగ్గర నుంచి చూసిన అమ్మాయి

సాధారణ బస్ కండెక్టర్ తమిళ ఇండస్ర్టీలో సూపర్ స్టార్ గా ఎలా ఎదిగాడో మనందరికీ తెలిసిందే. ఆయన వెనుక ఉన్నది కూడా ఆమెనే అట. శివాజీ రాజ్ గైక్వాడ్ లో ఏదో ప్రతిభ ఉందని గుర్తించిన ఆమె ఫిల్మ్ ఇండస్ర్టీకి అప్లయ్ చేయించింది. జాయిన్ కావాలని లెటర్ వచ్చిన సందర్భంలో కూడా ఆయన వద్ద డబ్బలు లేకుంటే రూ. 500 ఇచ్చి మరీ పంపించిందట. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే స్వభావం రజనీకాంత్ సొంతం. అప్పుడు ఆ సాయం చేసిన యువతి కోసం ఆయన ఇప్పటి వరకూ ఎదురు చూస్తున్నారంటే ఆయన కృతజ్ఞత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవరా అమ్మాయి. ఆయనకు ఎలా పరిచయం ఇక్కడ చూద్దాం.

ఆ అమ్మాయిని ఇష్టపడ్డ సూపర్ స్టార్

రజనీకాంత్ సినిమాల్లోకి రాక ముందు కండెక్టర్ అని మనకు తెలుసుకదా. వృత్తిలో భాగంగా ఆయన బస్సులో ఎంబీబీఎస్ చదివే అమ్మాయి తరుచూ ప్రయాణం చేసేది. ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ఇష్టపడ్డారట కూడా. కండెక్టర్ గా చేస్తూనే డ్రైవర్ ప్రేరణతో చిన్న చిన్న నాటకాలు వేసేవాడు రజనీకాంత్. ఆ నాటకాలు చూసేందుకు సదరు యువతిని ఆహ్వానించే వారట రజనీకాంత్. ఈ నేపథ్యంలో చెన్నైలోని అడియార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి ఒక లెటర్ వచ్చిందట.

దాన్ని చూసిన రజనీకాంత్ నేను అప్లయ్ చేయకుండా ఎలా వచ్చిందని అనుకున్నాడట. ఒక రోజు బస్సులో వెళ్తున్న క్రమంలో ఆ అమ్మాయి లెటర్ గురించి అడిగిందట. అప్పుడు తెలిసిందట ఆమెనే ఆ అప్లయ్ చేసిందని. మంచి ఆఫర్ వెళ్లండి అంటూ ఆమె ప్రోత్సహించిందట కూడా. ‘వెళ్లాలనే ఉంది కానీ అక్కడి ఖర్చులకు, ఉండేందుకు డబ్బులు లేవని’ రజనీకాంత్ ఆమెతో అన్నారట.

రూ. 500 ఇచ్చి మరీ పంపించింది

రజనీకాంత్ ఆర్థిక పరిస్థితులు తెలిసిన అమ్మాయి కాబట్టి రూ. 500 ఇచ్చి ‘నీలో చాలా ప్రతిభ ఉంది. నువ్వుల మున్ముందు చాలా ఎత్తుకు ఎదుగుతావు. ప్రపంచంలోనే గొప్ప నటుడిగా రాణిస్తావనే నమ్మకం ఉంది. నువ్వు వెళ్లాల్సిందే’ అంటూ పట్టుబట్టిందట. చెన్నై ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయిన రజనీకాంత్ తర్వాత ఒక ఆదివారం అమ్మాయి కోసం బెంగళూర్ కు వచ్చారట. కానీ ఆమె కనిపించలేదు. తర్వాతి రోజు కూడా ఆమె కోసం చూశారట అయినా ఆమె కనిపించలేదు. ఫ్రెండ్స్ తో ఆమె అడ్రస్ పట్టుకొని అక్కడకు వెళ్లి చూడగా తాళం వేసి ఉందట. తర్వాత రజనీకాంత్ గా మారి స్టార్ హీరో అయినా ఆ ఆమ్మాయి మళ్లీ ఆయనకు కనిపించలేదట.

ఆమె కోసం ఎదురు చూసిన రజనీ

ఈ విషయం తనను ఇప్పటికీ బాధపెడుతుందని చెప్పుకచ్చారు రజనీకాంత్. ఇప్పుడు ఇంత స్టార్ డమ్ వచ్చినా ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఆయన కళ్లు ఆమె కోసం వెతుకుతుంటాయని చెప్పుకచ్చారు రజనీకాంత్. ఇంతటి స్టార్ అయినా తన కోసం ఎప్పుడూ ఆ ఆమ్మాయి రాలేదని. అదే ఆమె గొప్పతనం అన్నారాయన.

విషయాలను పంచుకున్న శ్రీనివాసన్

రజనీకాంత్ జీవితంలోని ఈ ఘట్టాలను ప్రముఖ మళయాలీ నటుడు దేవన్ శ్రీనివాసన్ వెల్లడించారు. రజనీకాంత్ శ్రీనివాస్ తో కలిసి ‘బాషా’ సినిమాలో నటించారు (నగ్మా తండ్రి పాత్రలో). రజనీ షూటింగ్ సమయంలో ఈ విషయాలను ఆయనతో పంచుకున్నారని చెప్పాడు. ఆ సమయంలో ఆయన చాలా ఎమోషన్ అయ్యారని కూడా చెప్పాడు. ఏదో ఒక రోజు ఆమె కనిపిస్తుందని నేను ఆ సమయంలో ఓదార్చాను అన్నాడు.

నా మాటలు విన్న ఆయన చిన్న పిల్లవాడిలా ‘ఖచ్చితంగా వస్తుందంటావా’ అంటూ అడిగితే చాలా బాధపడ్డాను అన్నారు శ్రీనివాసన్. ఆయన ప్రతిభను ప్రోత్సహించిన అమ్మాయి రజనీకాంత్ వరల్డ్ స్టార్ అయిన తర్వాత కూడా ఆయనను చూసేందుకు రాలేదంటే ఆమె మనసు ఎంత గొప్పదో తెలుస్తోందని చెప్పారు.