అందుకే నా బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు.. కీర్తీ భట్

0
582

బిగ్ బాస్ సీజన్ 6లో అలరించిన కీర్తీ భట్ గురించి పరిచయం అక్కర్లేదు. అంతకు ముందు ఆమె గురించి పెద్దగా తెలియకపోయినా బిగ్ బాస్ లో ఆమె కాంటెస్ట్ చేసిన తీరుతో ఆకట్టుకుంది. బాగా పాపులర్ అయ్యింది కూడా. ఎన్నో ఎత్తు పళ్లాలు, ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పింది. దీనికి సంబంధించి ఆమె ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. సీజన్ 6 మొదట్లో హౌజ్ లోకి ఎంటరైన కీర్తీ భట్ డల్ గా కనిపించింది. ఇంతటి బోర్ అమ్మాయిని హౌజ్ లోకి ఎలా తీసుకున్నారంటూ మొదట్లో చాలా విమర్శలు వినిపించాయి.

చాలా మంది ఫ్యాన్స్

కానీ రాను రాను ఆమె హౌజ్ మెంబర్స్ తో నడుచుకునే తీరుతో చాలా మంది ఫ్యాన్స్ అయ్యారనే చెప్పాలి. తర్వాత సీజన్ కు రన్నరప్ గా కూడా నిలిచింది కీర్తి భట్. బిగ్ బాస్ హౌజ్ లో కీర్తీ భట్ పర్ఫార్మెన్స్ కు చాలా మంది అభిమానులయ్యారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎంత కష్టం ఎదురైనా.. అభిమానుల కోసం కొనసాగుతా అంటూ చెప్పుకచ్చిన ఆమె మంచి స్థానాన్ని దక్కించుకున్నారు.

అందరినీ కల్పోయిన అనాథలా

ఫిల్మ్ ఇండస్ర్టీలో రాణించాలనే సంకల్పంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన ఈ కన్నడ ముద్దుగుమ్మ మొదట బుల్లితెరలో కనిపించింది. ‘మనసిచ్చి చూడు’ టీవీ సీరియల్ తో ఆమె ప్రేక్షకులను పలకరించింది. ఈ సీరియల్ లో ఆమెకు అంత గుర్తింపు దక్కలేదు. తర్వాత బిగ్ బాస్ సీజన్ 6కు ఎంపికై హౌజ్ లోకి వచ్చింది. అప్పటి నుంచి బాగా ఫేమ్ అయ్యింది. కొన్ని కారణాలతో తన కుటుంబాన్ని మొత్తం కోల్పోయిందట కీర్తీ భట్. అనాథగా ఉన్న తను ఒకరికి మనసిచ్చిందట. కానీ తన బాయ్ ఫ్రెండ్ కూడా తనను వదిలి వెళ్లిపోయాడట. గోరు చుట్టుపై రోకలి పోటులాగా మరింత కుంగిపోయానట్లు తెలుస్తోంది.

ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు చెప్పిన కీర్తీ భట్

కీర్తీ భట్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, బుల్లితెరతో పాటు బిగ్ బాస్ హౌజ్ విశేషాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘కుటుంబం కోల్పోయి అనాథగా మిగిలిన నేను ఇండస్ర్టీలో రాణించాలనుకున్నాను. అప్పటికే అనేక బాధల్లో ఉన్న నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతన్ని లవ్ చేశాను. కొన్ని రోజులు బాగానే ఉన్నాం. తర్వాత బ్రేకప్ చెప్పి వెళ్లిపోయాడు. ఎందుకు అలా చేశావు అని నిలదీశాను. ఆయన చెప్పిన విషయాలు విని షాక్ అయ్యాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ర్టీలోకి ఎలా వచ్చావు..? అందుకు ఎం చేశావు అన్న అనుమానం ఉందట.

ఆయన ప్రవర్తనలో మార్పు

మొదట్లో బాగానే ఉన్నా.. కొన్ని రోజుల్లో ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. చాలా చులకగా చూడడం మొదలు పెట్టాడు. అతను నన్ను విడిచి వెళ్లిపోయాన తర్వాత చాలా రోజులు ఏడ్చాను, బాధ పడ్డాను. కానీ ఇప్పుడు అన్నింటినీ తట్టుకొని జీవించడం మొదలు పెట్టాను. ప్రస్తుతం లైఫ్ చాలా హ్యాపీగా సాగుతుంది. అందరినీ పోగొట్టుకొని అనాథనైన నేను ఒక పాపను దత్తత తీసుకున్నాను. త్వరలోనే మరొకరిని దత్తత తీసుకోవాలి అనుకుంటున్నా.. చూడాలి మరి కాలం ఏం నిర్ణయిస్తుందో’ అంటూ చెప్పింది.