చెల్లెలికి కాబోయే భర్తను పెళ్లాడిన అక్క

0
696

పెళ్లిచూపులు, నిశ్చితార్థం, వివాహ తంతులో కొన్ని వింతలు జరుగుతాయి. ఒకరిని చూసేందుకు మరొకిరిని ఇష్టపడడం, ఒకరితో నిశ్చితార్థం చేసుకోబోయి మరొకరిని అడగడం, వివాహం సమయంలో కూడా ఒకరికి కట్టే తాళి మరొకరికి కట్టడం. సరే దాని సంగతి అలా ఉంచితే. రోజా సినిమా గుర్తుండే ఉంటుంది కదా.. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చింది.

అందులో అరవింద్ స్వామి మధుబాల అక్కను వివాహం చేసుకునేందుకు వచ్చి మధుబాలను చేసుకుంటాడు. అది సినిమా.. కానీ నిజ జీవితంలో కూడా ఇలాంటిదే ఒకటి మన కళ్లముందు జరిగింది. అది కూడా ఒక స్టార్ యాంకర్ జీవితంలో ఇది కొంచెం రివర్స్ చెల్లిని చేసుకునే వాడిని అక్క ఎగరేసుకుపోయిందన్న మాట.

బుల్లితెరపై రాణించిన సమీరా షరీఫ్

సీరియల్ నటిగా తన కెరీర్ ను ప్రారంభించిన సమీరా షరీఫ్ తర్వాత బుల్లితెరపై ప్రధాన పాత్రలు పోషిస్తూ, చివరికి యాంకర్ గా కూడా రాణించింది. సమీరా షరీఫ్ దాదాపు 10 సంవత్సరాలకు పైగా బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. భార్యామణి, అభిషేకం, ఆడపిల్ల, ముద్దుబిడ్డ లాంటి ఎన్నో డైలీ సీరియల్స్ లో నటించి మెప్పించింది. దీంతో పాటు యాంకర్ గా కూడా ఎన్నో షోలు, ఈవెంట్లను నిర్వహించింది.

బుల్లితెర ఇండస్ర్టీలో సమీరా షరీఫ్ కు మంచి గుర్తింపే ఉండేది. ఆమె డ్యాన్స్, సీరియల్స్ లో ఆమె పాత్రల్లో ఒదిగే తీరు ప్రతి ఒక్కిరినీ కట్టి పడేసేది. కానీ చాలా కాలంగా ఆమె ఇండస్ర్టీకి దూరంగా ఉంటుంది. బహూషా పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ బాధ్యతలతో రాలేకపోయిందని కూడా వాదనలు ఉన్నాయి.

చెల్లెలికి కాబోయే భర్తతో లవ్ లో

ఇటీవల ఆమె ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో కొన్ని ఆసక్తి కర విషయాలు వెల్లడించింది సమీరా షరీఫ్. ‘నాది లవ్ మ్యారేజ్, నా భర్త నాకంటే చాలా తక్కువ వయస్సున్న వాడు. అయితే తనను నా చెల్లి పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ ఆయనకు నేను పడిపోయా. ఆయన ఎవరో కాదు.. సినిమా యాక్ట్రస్ సనా కొడుకు. ఆయన పేరు అన్వర్. మొదట్లో తనను మా చెల్లికి ఇవ్వాలి అనుకున్నారు. కానీ నాకు అన్వర్ అంటే ఇష్టం పెరిగింది.

ఫేస్ బుక్ రిక్వెస్ట్

మొదట్లో ఫేస్ బుక్ రిక్వెస్ట్ పెట్టాను. ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. తర్వాత పరిచయాలు పెరిగాయి. ఒకరిని ఒకరం అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నాం. తన చెల్లి కోసం అనుకున్న వ్యక్తి నాకు భర్తగా వచ్చాడు.’ ఇలా తన మ్యారేజ్ విషయాలను చెప్పుకచ్చింది సమీరా షరీఫ్. ఆమె ఈ విషయాలు వెల్లడించినప్పటి నుంచి అప్పటి నుంచి బుల్లితెర ఇండస్ర్టీ ఆమెను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందట.

అక్క పెళ్లి చూపులు

అందుకే మన పెద్దవాళ్లు చెప్పినట్లు అక్క పెళ్లి చూపులు జరుగుతున్న సందర్భంలో చెల్లిని, చెల్లి పెళ్లి చూపులు జరుగుతున్న సందర్భంలో అక్కను (అక్కకు వివాహం కాకుండా ఉంటే) కనిపించకుండా దాస్తారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుందనే కాబోలు. సమీరా షరీఫ్ మాత్రం చిన్న వాడైన అన్వర్ ను కట్టుకోవడం కొంత వింతనే మరి.