సినీ ఇండస్ర్టీపై కీర్తి సురేశ్ సంచలన వ్యాఖ్యలు

0
308

సినీ ఇండస్ర్టీలో కాస్టింగ్ కోచ్ ప్రకంపణలు సృష్టిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు కాస్టింగ్ కోచ్ పై వివాదం తెస్తూనే ఉన్నారు. ప్రతిభను బట్టే మూవీల్లో ఛాన్స్ ఇవ్వాలి కానీ ఇలా కాస్టింగ్ కోచ్ తో యువతుల్లోకిన నటనను తొక్కేస్తున్నారంటూ వివాదాలు ఇండస్ర్టీని కుదిపేస్తూనే ఉంటుంది. ఇది ఒక్క టాలీవుడే కాదు. మొత్తం సినీ ఇండస్ర్టీకి పాకింది. అప్పట్లో ఇండస్ర్టీ నుంచి కాస్టింగ్ కోచ్ పూర్తిగా తొలగిపోవాలని హీరోయిన్లు నడుం బిగించారు కూడా. ‘మహానటి’ఫేం కీర్తి సురేశ్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి లేదు. అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ బిజీగానే కనిపిస్తున్నా మహానటి తర్వాత అంతటి గుర్తింపు తెచ్చే సినిమాలు లేకపోవడంతో కొంచెం వెనుబడిందనే చెప్పాలి.

అవకాశాలు తలుపుతట్టడం లేదన్న వాదనలు

దీనికి కారణం గ్లామర్ షో చేయకపోవడమే అంటూ ఇండస్ర్టీలో డా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాను మాత్రం గ్లామర్ షోకు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేదే లేదంటూ అమ్మడు తెగేసి చెప్తుందట. కానీ సిని ప్రపంచం మాత్రం ఆమెను వెంటాడుతూనే ఉందని పుకార్లు ఉన్నాయి. తాను చాలా పద్ధతిగా ఉండే పాత్రలకు మాత్రమే అనుమతి ఇస్తానని ఆమె గతంలో చాలా సార్లు చెప్పుకచ్చింది కూడా. అందుకే అవకాశాలు తలుపుతట్టడం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు ఏదో ఒక సినిమాతో బాక్సాఫీస్ హిట్ సొంతం చేసుకుంటూ మెల్లగా కెరీర్ ను నెట్టుకస్తుంది కీర్తి సురేశ్. ఇప్పటి వరకూ ఆమె చివరి చిత్రం ‘సర్కారువారి పాట’లో ఆమె మహేశ్ బాబు కలిసి నటించి మెప్పించింది కూడా.

అందాల ఆరబోతకు కూడా

చేతిలో చాలినన్ని ప్రాజెక్టులు లేకపోవడంతో కీర్తి సురేశ్ కొంచెం పట్టు సడలిస్తుందని తెలుస్తోంది. సాంప్రదాయ పద్ధతిలో మంచి కట్టూ బొట్టూతో హుందాగా ఉన్న పాత్రలను ఎంచుకునే ఆమె ప్రస్తుతం ఇండస్ర్టీలో పోటీని తట్టుకునేందుకు గ్లామర్ షోకు కూడా సమ్మతిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెప్తున్నాయి. ఎవరు ఏం సలహా ఇచ్చారోగానీ ఆమె అందాల ఆరబోతకు కూడా సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇందులో కమర్షియల్ గా ఎదగడం ఒక కోణమైతే అప్ కమింగ్ హీరోయిన్లతో పోటీని తట్టుకోవడం ఇంకో కోణం అని చెప్తూంది. సర్కారివారి పాట సినిమాలో అందాలను ఆరబోస్తూ మరింత రెచ్చిపోయింది ఈ బ్యూటీ. అందులోని ఆమె మాస్, గ్లామర్ టచ్ చూసిన వారంతా నోరెళ్లబెట్టారంట.

ఎవరైనా చెప్తే మీరు ఏమంటారు

ఆమె ఇటీవల ఇండస్ర్టీలో జరుగుతున్న కాస్టింగ్ కోచ్ పై నోరువిప్పింది. ఆ మాటలు ఇప్పుడు అటు ఇండస్ర్టీలో ఇటు నెట్టింట్లో బాగా వైరల్ గా మారాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. ఇటీవల ఆమెకు ఒక ప్రశ్న ఎదురైంది. ‘మీకు కాస్టింగ్ కోచ్ ఎదురైందా..? కమిట్ మెంట్ ఇస్తేనే హీరోయిన్ అవకాశం ఇస్తానని ఎవరైనా చెప్తే మీరు ఏమంటారు..?’. ఈ ప్రశ్నపై ఆమె స్పందించింది. ఇండస్ర్టీలో కాస్టింగ్ కోచ్ కొనసాగుతున్న ప్రతిభ అనేది ముందు వరుసలో ఉంటుంది నా ప్రగాఢ విశ్వాసం. ఒక వేళ ఎవరికైనా ఇలాంటి ఘటన ఎదురైతే ఎలా స్పందిస్తారో తెలియదు గానీ.

ఎట్టి పరిస్థితుల్లో సమ్మతించను

నా వరకు అయితే నేను ఇండస్ర్టీ నుంచే బయటకు వెళ్లిపోతాను. ఇండస్ర్టీలో కాస్టింగ్ కోచ్ ఉందని నాకు బాగా తెలుసు. దాని గురించి కూడా చాలా మంది సహ నటులు నాతో చెప్పారు కూడా. దానికి నేను ఎట్టి పరిస్థితుల్లో సమ్మతించను. కాస్టింగ్ కోచ్ అనేది మన బిహేవిర్ బట్టి ఉంటుంది. మనం నటనను చూపుతున్న ఎక్కడో ఒక చోట నెగ్గుకస్తాం అనుకున్నప్పుడు కమిట్ మెంట్ కు దూరంగా ఉండాలి.