సీక్రెట్ గా ‘హైపర్ ఆది పెళ్లి’..?! వధువు ఎవరో తెలిస్తే షాక్..?

0
234

జబర్ధస్త్ లో కో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆది షోకే హైలట్ గా మారాడు. ఆది లేని జబర్ధస్త్ ను చూడడం ప్రేక్షకులకు కూడా కష్టంగా మారింది. కొన్ని రోజుల క్రితం ఆయన షో నుంచి బయటకు వెళ్లడంతో రేటింగ్స్ పై ఇది తీవ్రంగా ప్రభావం చూపిందని మల్లెమాల సైతం చెప్పింది. మొదట కో కంటెస్టెంట్ కొనసాగుతూ మంచి పంచులు వేస్తూ తర్వాత ‘హైపర్ ఆది-రైజింగ్ రాజు’ టీమ్ కు లీడర్ గా రైజింగ్ రాజుతో కలిసి చేశాడు. హైపర్ ఆది పంచులను తెలుగు వారు విపరీతంగా ఎంజాయ్ చేసేవారు. క్రమక్రమంగా ఆయనకు క్రేజ్ పెరగడంతో మల్లెమాలతో పాటు మరికొన్ని ప్రొడక్షన్ యూనిట్లు కొన్ని షోలకు హోస్ట్ లుగా తీసుకున్నారు. తర్వాత వస్తున్న ఆఫర్లను వినియోగించుకుంటూ వెండితెరలో కూడా తన సత్తా చాటుకున్నాడు ఆది. ఇంత హైప్ ను సొంతం చేసుకున్న ఆది ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా అంటూ అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది.

షోలతో అలరిస్తున్న ఆది

హైపర్ ఆది సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ వేస్తుండడంతో పాటు ఈ టీవీ లో మల్లెమాల సమర్పించే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’, ‘ఢీ: ద డ్యాన్స్ షో’లో హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. తన దైన మార్క్ పంచులతో సాగుతున్న ఆయన స్కిట్లకు యూటూబ్ లో కూడా బాగా వ్యూస్ వస్తున్నాయంటే ఆయన సత్తా ఏంటో అర్థమవుతుంది. షోలో యాంకర్లను ఆడుకోవడంలో ఆయనే ముందుంటాడనడంలో సందేహం లేదు. జబర్ధస్త్ అనసూయ, రష్మీ, రీసెంట్ గా కన్నడ నుంచి వచ్చిన యాంకర్ సౌమ్యా రావులను కూడా తన స్కిట్లలో ఇన్వాల్వ్ చేస్తూ వారిపై వేసే పంచులు కూడా బాగా పేలుతాయి. ఇటీవల సౌమ్యారావుపై ఆయన వేసిన పంచ్ బాగా వైరల్ అయ్యింది.

పెళ్లి వార్తలపై క్లారిటీ

హైపర్ ఆదికి పెళ్లి జరిగిందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల పెళ్లి ఫొటోలు కూడా ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. దీనికి తోడు ఆయన పెళ్లి కొడుకుగా కూర్చున్న వీడియోను కూడా కొందరు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆయన అభిమానులు కూడా హైపర్ ఆదికి పెళ్లి జరిగిందని, ఆయన వైఫ్ ఎవరనీ సెర్చ్ కూడా మొదలు పెట్టారు. మరి అది నిజమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సినిమా షూట్ లో భాగంగానే

ఒక సినిమా షూట్ లో భాగంగా హైపర్ ఆది పెళ్లి సీన్ ఉంది. అందుకే ఆయన పెళ్లి కొడుకుగా తయారై పెళ్లి పీటలపై కూర్చుకున్నాడు. వధువు ప్లేస్ లో ఉన్నది కూడా ఒక సీరియల్ నటి అని తెలిసింది. ఈ ఫొటోలను వైరల్ రాయుళ్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. ‘హైపర్ ఆది సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు’ అంటూ గాసిప్ లు కూడా క్రియేట్ చేశారు. అయితే అది ఓ చిత్ర సన్నివేశంలో భాగమని హైపర్ ఆది సన్నిహితులు చెప్తున్నారు. హైపర్ ఆదికి ఇప్పుడు దాదాపు 32 సంవత్సరాలు ఉంటాయి. గతంలో కూడా ఇలాంటి రూమర్స్ వచ్చిన సమయంలో తాను పెళ్లి చేసుకుంటే తప్పకుండా చెప్తానని ఆయన మాట కూడా ఇచ్చాడు. దీంతో హైపర్ ఆది పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది.

అన్ని రంగాల్లో రాణిస్తున్న ఆది

ఇప్పటికే బుల్లితెరపై తన ముద్రను వేసుకున్న ఆది, వెండితెరపై కూడా రాణిస్తున్నాడు. హీరోకు ఫ్రెండ్ గా, చిన్న చిన్న రోల్స్ చేస్తూ అక్కడ కూడా అభిమానులను సంపాదించుకుంటున్నాడు. అల్లరి నరేశ్ హీరోగా నటించిన ‘మేడ మీద అబ్బాయి’ సినిమాకు ఆది మాటలు కూడా సమకూర్చారు. చిత్ర సీమకు సంబంధించి పలు విభాగాల్లో రాణిస్తూ గుర్తింపు సంపాదించుకుంటున్నారు ఆది.