రెమ్యునరేషన్ విషయంలో మన హీరోయిన్లు ‘తగ్గేదేలే’.. ఎక్కువ తీసుకుంటుంది ఎవరంటే

0
477

‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే నానుడిని మన టాలీవుడ్ హీరోయిన్స్ బాగానే ఉపయోగించుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. ఒకటి, రెండు సక్సెస్ లు రావడంతో హీరోలకు తీసిపోకుండా రెమ్యునరేషన్ పెంచేస్తూ నిర్మాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తామేం తక్కువ తిన్నామంటున్నా సీనియర్ హీరోయిన్లు. వారు కూ రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు.

బాలీవుడ్ తారలకు పోటీగా

మన తారలు రెమ్యునరేషన్ విషయంలో బాలీవుడ్ భామలకు పోటీగా నిలుస్తున్నారనడంనలో సందేహం లేదు. బాలీవుడ్ మూవీస్ ను దేశం మొత్తం చూస్తుంది. అక్కడి ఇండస్ర్టీకి రేట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటీవల మన టాలీవుడ్ కూడా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ చేరుతుండడంతో ఇక్కడి తారలు కూడా భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి తెలుసుకుందాం..

ఎవరి రెమ్యునరేషన్ ఎంత

ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతోంది సమంత. వయోసైటిస్ తో బాధ పడుతున్నా చికిత్స తీసుకుంటూ మరీ సినిమాలను తీస్తుంది ఈ చిన్నది. నాగ్ తో డైవర్స్ తీసుకున్న సామ్ కెరీర్ లో మాత్రం దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన ‘యశోద’ బాక్సాఫీస్ హిట్ సాధించడంతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక సామ్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఆమె ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకూ తీసుకుంటుంది. అప్పట్లో బాగా మెప్పించిన కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయన తారా ఇప్పుడు ఎక్కువగా సీనియర్ హీరోలతో జోడీగా నటిస్తోంది.

వెనుకబడ్డ కీర్తి సురేశ్

ప్రస్తుతం ఆమె ఒక్క సినిమాకు రూ. 3 కోట్లకు పైగానే తీసుకుంటుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. లేడీ ఓరింయంటెడ్ సినిమాలతో కెరీర్ లో వెనుకబడ్డ తార కీర్తి సురేశ్.. తర్వాత పుంజుకుంది. స్టార్ యంగ్ హీరోల సరసన నటిస్తూ ఇది వరకు రూ. 2కోట్లు తీసుకున్న ఆమె ఇప్పుడు ఏకంగా ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రూ. 4 కోట్లు ఒక్కో సినిమాకు

బుట్టబొమ్మ పూజా హెగ్డే అల వైకుంఠ పురం నుంచి చాలా బిజీ అయిపోయిందట. ఈ బ్యాటీ ఒక్కో సినిమాకు రూ. 5కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ప్రస్తుతం అనుష్క శెట్టికి పెద్దగా ప్రాజెక్టులు లేవు. కానీ నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఇక ఆమె రెమ్యునరేషన్ విషయానికి వస్తే రూ. 4 కోట్లు ఒక్కో సినిమాకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ‘పుష్ప’తో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మికా మందన. ఆమెకు బాలీవుడ్ లో కూడా చాలా అవకాశాలు వస్తున్నాయట. అయితే ఆమె ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సినీ ఇండస్ర్టీ చెప్పుకుంటుంది.