టాలీవుడ్ లో బాక్సాఫీస్ హిట్లు.. ఎక్కువ రోజులు ఆడిన మన సినిమాలేంటో చూద్దాం

0
233

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతటి సినిమా అయినా రెండు వారాలకంటే ఎక్కువ థియేటర్లలో ఉండడం లేదు. మరీ హిట్ టాక్ సంపాదించుకుంటే అదనంగా మరో రెండు లేదా మూడు వారాలు అంతే. గడపగడపకూ ఓటీటీ రావడంతో అందులో కూడా కొత్త కొత్త సినిమాలు రిలీజ్ కావడంతో థియేటర్ కు వెళ్లేందుకు ప్రేక్షకులు కూడా ఎక్కువ ఇంట్రస్ట్ చూపడం లేదు. దీంతో థియేటర్ లో రిలీజైన రెండు వారాలకే కలెక్షన్లు డల్ అయి మరో సినిమా వస్తుంది.

ప్రస్తుతం చిత్రం రంగంలో చోటు చేసుకుంటున్న పెను మార్పులు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. కొత్త కొత్త డైరెక్టర్లు, కొత్త కొత్త కంటెంట్ తో రావడంతో ఉన్న థియేటర్లు సరిపోక చిత్రాలను మార్చడం కూడా కారణంగా భావించవచ్చు. టాలీవుడ్ లో ఎక్కువ రోజులు ఆడిన సినిమాల గురించి ఇక్కడ చూద్దాం..

లెజెండ్

బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో వచ్చిన లెజెండ్ 2014లో రిలీజైంది. ఇది 2017 ( దాదాపు 3 సంవత్సరాలు) వరకూ థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. ప్రొద్దుటూరు, ఆర్వేటీ థియేటర్ లో 55 రోజులు ప్రదర్శించాక, షిఫ్ట్ చేంజ్ లో భాగంగా అర్చన థియేటర్ లో దాదాపు 1116 రోజుల వరకూ ప్రదర్శింపబడింది.

మగధీర

దర్శక ధీరుడు రాజమౌళి, మోగా వారసుడు రాం చరణ్ కాంబోలో వచ్చిన చిత్రం మగధీర షిఫ్ట్ ల వారీగా కర్నూల్ లో 1000 రోజులు ఆడింది. వసూళ్లలో చూస్తే 2009లో రూ. 75 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.

పోకిరీ

పూరీ జగన్నాథ్, మహేశ్ బాబుతో కలిసి తీసిన సినిమా 2006లో వచ్చిన పోకిరీ. ఇది ఇండస్ర్టీకి బాక్సాఫీస్ హిట్ ఇచ్చింది. ఇది పూరీ జగన్నాథ్ కెరీర్ లో కూడా బెస్ట్ మూవీగా చెప్పచ్చు. ఇది థియేటర్లలలో 580 రోజులు ప్రదర్శినకు నోచుకుంది.

మంగమ్మగారి మనుమడు

కోడి రామకృష్ణ, బాలకృష్ణ కాంబోలో 1984లో వచ్చిన చిత్రం ‘మంగమ్మ గారి మనుమడు’ ఇది బాలయకృష్ణకు సోలో బాక్సాఫీస్ హిట్ ఇచ్చింది. ఈ సినిమా 567 రోజులు థియేటర్లలో ప్రదర్శింపబడింది.

మరో చరిత్ర

బాల చందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా చేసిన చిత్రం ‘మరో చరిత్ర’. ఇది టాలీవుడ్ లో మాస్టర్ పీస్ గా నిలిచింది. 1978లో రిలీజ్ అయిన ఈ సినిమా 556 రోజులు థియేటర్లలో సందడి చేసింది.

ప్రేమాభిషేకం

దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వర్ రావు కాంబోలో 1981లో వచ్చిన సినిమా ‘ప్రేమాభిషేకం’. ఇందులో శ్రీదేవి, జయసుధ, నాగేశ్వర్ రావుతో కలిసి నటించారు. ఫస్ట్ టైం నెగెటివ్ ఎండింగ్ తో వచ్చిన ఈ మూవీ రీలీజైనప్పటి నుంచి 533 రోజులు ఆడింది.

లవకుశ

తెలుగులో తొలి కలర్ మూవీ ‘లవకుశ’ 1963లో రిలీజ్ అయ్యింది. దర్శకులు సీ పుల్లయ్య, సీఎస్ రావులు సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి చేసిన మూవీ ఇది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలే చూసిన ప్రేక్షకులకు కలర్ వచ్చిన ఈ సినిమా విపరీతమైన ఆనందాన్ని ఇచ్చిందనే చెప్పాలి. అప్పట్లో కలక్షన్ల పరంగా ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ఇది థియేటర్లలో 469 రోజులు ఆడింది. అప్పుడున్న పైసల విలువను ఇప్పుడు లెక్కగడితే దాదాపు రూ. కోటికి పైగా రాబట్టింది ఈ సినిమా.

ప్రేమ సాగరం

డైరెక్ట్ తెలుగు సినిమాలు హిట్ సాధిస్తున్న కాలంలో వచ్చిన డబ్బింగ్ మూవీ కూడా మంచి రికార్డులే సాధించిందని చెప్పాలి. తమిళ్ డైరెక్టర్ హీరో శింబు తండ్రి రాజేందర్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన సినిమా ‘ప్రేమ సాగరం’ కోలీవుడ్ లో హిట్టయిన సినిమాను డబ్ చేసి తెలుగులో విడుదల చేశారు. 1983లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో 465 రోజులు ప్రదర్శనకు నోచుకుంది.

సమరసింహా రెడ్డి

బీ గోపాల్, బాలకృష్ణతో తీసిన సినిమా ‘సమరసింహా రెడ్డి’. ఈ మూవీ 77 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. మరికొన్ని కేంద్రాలలో దాదాపు 365 రోజులు ఆడింది.

ఖైదీ

కోదండ రామిరెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన మూవీ ‘ఖైదీ’. ఈ చిత్రంతో మెగాస్టార్ టాలీవుడ్ లో సంచలనం సృష్టించారు. ఈ మూవీ 365 రోజులు థియేటర్లలలో ఆడింది.

అడవి రాముడు

దర్శక రత్న కే రాఘవేందర్ రావు, ఎన్టీఆర్ కాంబోలో (అది కూడా మొదటి సినిమా) 1977లో విడుదలైన ‘అడవి రాముడు’. ఇది అప్పట్లో రూ. 3 కోట్ల షేర్ రాబట్టింది. ఈ మూవీ 365 రోజులు థియేటర్లలలో ఆడింది.