చచ్చేలోగా ఆ విషయాన్ని బయట పెడతా

0
1480

అప్పట్లో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ నాకు తెలుసని ఓ ఇంటర్వ్యూలో భాగంగా డైరెక్టర్ తేజ చెప్పడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చగా మారింది. డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ కాంబినేషన్ టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ ను పరిచయం చేస్తూ తీసిన మొదటి సినిమా ‘చిత్రం’ ఇది ఇండస్ర్టీని కుదిపేసింది. తర్వాత వీరి కాంబోలోనే ‘నువ్వు-నేను, మనసంతా నువ్వే’ చిత్రాలు వచ్చాయి. ఈ మూవీస్ తో ఉదయ్ కిరణ్ కు లేడీ ఫాలోయింగ్ బాగా పెరిగింది. లవర్ బాయ్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు.

ఉదయ్ కిరణ్ తన నివాసంలో సూ:సైడ్

తర్వాత వచ్చిన సినిమాలు ఆయనకు అంతగా కలిసి రాలేదు. వరుస ప్లాపులు పడుతుండడంతో తీవ్రంగా కుంగిపోయాడు. అదే టైంలో వివాహం కూడా జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ తన నివాసంలో సూ:సైడ్ చేసుకున్నాడు. దీనిపై చాలా కామెంట్లు వినిపించాయి. వరుస ప్లాపులతోనే అంటూ కొందరు, కొత్త సబ్జెక్టులకు ఉదయ్ ఫిజిక్ సెట్ కాకపోవడం వల్లే అంటూ ఇంకొందరు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవల వల్లే అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. కానీ అసలు కారణం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఉదయ్ ఆత్మహత్యకు ముందు తనకు ఫోన్ చేశాడని దర్శకుడు తేజ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.

అసలు విషయం ఇంత వరకూ ఎవరికీ తెలియదు

‘చిత్రం’ సబ్జెక్టుకు సరిగ్గా సరిపోతాడని తేజ ఉదయ్ కిరణ్ ను హీరోగా ఎంచుకొని టాలీవుడ్ కు పరిచయడం చేశాడు. తర్వాత ఆయనతోనే నువ్వు-నేను మూవీ తీశాడు తేజ. ఈ రెండు చిత్రాలు ఉదయ్ కి మంచి గుర్తింపు తేగా.. తేజ కూడా పాపులర్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వీఎన్ రెడ్డి డైరెక్షన్ లో ‘మనసంతా నువ్వే’తో యూత్ ఫెవరేట్ యాక్టర్ గా మారాడు. ఆ తర్వాత ఆయనకు కాలం కలిసి రాలేదు. వరుసగా ప్లాపులు ఎదురయ్యాయి. ఇందులోనే వివాహం కూడా జరిగింది. జనవరి, 2014లో తన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయాడు ఉదయ్ కిరణ్. అప్పటి నుంచి సూసైడ్ పై మీడియాలో రకరకాలుగా కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అసలు విషయం ఇంత వరకూ ఎవరికీ తెలియదు. డైరెక్టర్ తేజ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉదయ్ ఆత్మహత్యపై ఆసక్తి కరమైన కామెంట్లు చేశాడు.

కారణాలను బయట పెడతా

‘ఉదయ్ కిరణ్ ది సున్నితమైన మనస్తత్వం. వరుసగా హిట్లు వస్తుండడంతో బాగా పొంగిపోయాడు. ఒక్క సారిగా టాలీవుడ్ లో ఆయన పేరు మారుమోగడంతో స్టార్ డమ్ ను తట్టుకోలేకపోయాడు. తర్వాత వచ్చిన ప్లాపులను ఆయన మ్యానేజ్ చేయలేకపోయాడు. ఇందులోనే కొంచెం బ్యాలెన్స్ తప్పాడు. మొదట్లో హిట్లు తర్వాత ప్లాపులతో ఉక్కిరిబిక్కిరి అయి డీప్రెషన్ లోకి వెళ్లాడు.

ఆ సమయంలోనే తనతో ‘ఔనన్నా కాదన్నా’ మూవీ చేశాను. అది కొంచెం బాగానే ఆడింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునే ముందు నాకు ఫోన్ చేశాడు, జరిగినదంతా చెప్పాడు. ఏ కారణంతో ఆయన సూసైడ్ చేసుకున్నాడో నాకు తెలుసు. ఇప్పుడు అవి నేను బయటపెట్టను సమయం వచ్చినప్పుడు తప్పకుండా బయట పెడతా. నేను చనిపోయే లోగా ఉదయ్ ఆత్మహత్యకు గల కారణాలను బయట పెడతా’ అంటూ చెప్పారు తేజ. తేజ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో ప్రస్తుతం చర్చనీయాంగా మారింది.