హాట్ హీరోయిన్ ముందు సుడిగాలి సుధీర్ పరువు తీసిన బిత్తిరి సత్తి

0
1348

సుడిగాలి సుధీర్ బిత్తిరి సత్తికి ఉన్న కనెక్ట్ అంతా ఇంతా కాదు.. ఇద్దరూ కలిస్తే పేలే పంచ్ లు వేరే లెవల్ గా గతంలోనూ వీరిద్దరూ టీవీషోల్లో ఎంటర్ టైన్ చేశారు. సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన మూవీ ‘గాలోడు’ నవంబర్ 18న (శుక్రవారం) గ్రాండ్ గా రిలీజైంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా సుధీర్, హీరోయిన్ గెహ్నా సిప్పీలతో కలిసి ఈ వెంట్ ను బిత్తిరిసత్తి మేనేజ్ చేశాడు.

హీరో హీరోయిన్లతో వేదికపై ఇంటర్వ్యూ

హీరో హీరోయిన్లతో వేదికపై ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాడు సత్తి. సినిమాలో దుమ్ములేపినట్టున్నావు అంటూ సుధీర్ ను పొగడ్తలతో ముంచెత్తాడు సత్తి. సుధీర్ పొంగిపోతుండగానే పరువు తీశాడు. ‘మంచాలు తెప్పించమంటావా..?’ అంటూ పంచ్ వేశాడు. దీంతో ఈ వెంట్ అంతా నవ్వులతో నిండిపోయింది. ఈ పంచ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అరె రాజు ముగ్గురికి చెక్క కుర్చీలు తేరా

మూవీ ప్రమోషన్ లో భాగంగా బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేస్తానని హీరో, హీరోయిన్లతో అన్నాడు. సరే కుర్చీలు తెప్పించన్నా అంటూ సుధీర్ సత్తిని కోరాడు. జుబులోంచి ఫోన్ తీసిన సత్తి ‘అరె రాజు ముగ్గురికి చెక్క కుర్చీలు తేరా’ అని చెప్పి. కుర్చీలు ఒకేనా మంచాలు తెప్పించనా..! అంటూ దారుణమైన పంచ్ విసిరాడు. కుర్చీలు చాలన్నా, ఇంటర్వ్యూకు మంచాలు ఎందుకన్నా అని సుధీర్ చెప్పగా.. రాజుకు సుధీర్ పేరు చెప్పగానే మంచాలు తెప్పించనా అంటున్నాడు. అంటూ సత్తి చెప్పాడు.

టాలీవుడ్ లో మంచి ప్రచారం

వీరి మాటలు అర్థం కాకపోవడంతో హీరోయిన్ గెహ్నా సిప్పీ చూస్తూ ఉండిపోయింది. బిత్తిరి సత్తి ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ లోని స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రాం చరణ్, డైరెక్టర్ రాజమౌళిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఆయన పంచ్ లు మూవీ ప్రమోషన్ కు ఎంతో ఉపయోగపడతాయని టాలీవుడ్ లో మంచి ప్రచారం ఉంది. సుధీర్ కు సత్తికి మధ్య కామెంట్లు కొత్తేమి కావు. నవ్వులు పూయించేందుకు సుధీర్ తన ఇమేజ్ ను అంతగా పట్టించుకోడు. సుధీర్ ఇమేజ్ కు ఇది కొంత వరకూ తోడ్పడుతుంది.

సుధీర్ కు 3వ చిత్రం

గాలోడు సినిమా సుధీర్ కు 3వ చిత్రం. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాఫ్ట్ వేర్ సుధీర్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డే గాలోడుకు దర్శకత్వం వహించారు. ట్రైలర్, ప్రోమో ఇప్పటికే ప్రేక్షకుల మన్ననలు పొందింది. సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతో సుధీర్ మంచి హిట్ ఇస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.