‘గుంటూరు కారం’ లో పాటలొద్దు అంటూ రచ్చ

0
266
mahesh babu guntur karam

‘గుంటూరు కారం’. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మార్కెట్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. సినిమాకి టైటిల్ ని కూడా ఖరారు చేయకముందే ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 150 కోట్ల రూపాయలకు పైగా జరిగింది.

క్రేజీ కాంబినేషన్ అవ్వడం, దానికి తోడు సంక్రాంతి సీజన్ లో వస్తున్న ఏకైక కమర్షియల్ మాస్ మూవీ అవ్వడం వల్ల ఈ చిత్రానికి ఈ రేంజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్ మరియు మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ మొన్న విడుదలైన ‘ఓ మై బేబీ’ అనే సాంగ్ కి మాత్రం చాలా పూర్ రెస్పాన్స్ వచ్చింది.

mahesh babu guntur karam

కృష్ణగారి కారుమీద ఆ కటౌట్‌లు ఏంటయ్యా.. బుద్దుందా!…

మహేష్ ఫ్యాన్స్ సంగతి మన అందరికీ తెలిసిందే. సినిమా బాగుంది అంటే బాగుందని చెప్తారు, లేకపోతే మొహమాటం లేకుండా అందరి ముందే బాలేదని చెప్పేస్తారు. తమ అభిమాన హీరో సినిమా అని ముందు వెనుక కూడా ఆలోచించరు. ఈ సాంగ్ విషయం లో కూడా అదే జరిగింది. మహేష్ రేంజ్ సాంగ్ అసలు కాదని, ఇలాంటి చెత్త పాటలను కంపోజ్ చెయ్యడానికి ఆ థమన్ కి అంతంత రెమ్యూనరేషన్స్ ఇచ్చి మేపుతున్నారా? అంటూ నిర్మాత నాగ వంశీ ని ట్యాగ్ చేసి ఫ్యాన్స్ తిడుతున్నారు.

ఇక థమన్ పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పాపం ఆయన ఏ ట్వీట్ వేసినా కామెంట్ సెక్షన్ లో బండ బూతులు తిడుతూ కనిపిస్తున్నారు. సినిమాలో అసలు పాటలు లేకపోయినా మేము ఏమి అనుకోము కానీ, ఇలాంటి చెత్త పాటలను మా మొహాన కొట్టి సినిమా మీద ఉన్న హైప్ ని పోగొట్టొద్దు అంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా రచ్చ చేస్తున్నారు.

ఆ పాట ని సినిమాలో నుండి తీసేయమంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇది చూసిన కొంతమంది విమర్శకులు ఇంత అతి అవసరమా?..సినిమాలో ఉన్న ప్రతీ పాట క్లిక్ అవ్వాలని లేదు, పాటలు సూపర్ హిట్ అయ్యి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలను మన టాలీవుడ్ లో ఎన్నో చూసాము. అలాంటిది కేవలం ఒక పాట కోసం ఎందుకు ఇంత రచ్చ అని మండిపడుతున్నారు.