‘ఆరెంజ్’ రీ రిలీజ్.. 12 ఏళ్ల తర్వాత మూవీపై మరోసారి స్పందించిన నాగబాబు

0
253

దాదాపు 12 ఏళ్ల క్రితం జరిగిన ఒక డిజాస్టర్ ను గుర్తు చేసుకున్నారు నాగబాబు. అప్పట్లో ఆయన ఓ మూవీపై నెగెటివ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడది గుర్తుకు వచ్చి గిల్ట్ గా ఫీలవుతున్నారట. అది కల్ట్ క్లిసిక్ మూవీ అని ఇప్పుడు రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఇంతకీ ఏంటా మూవీ..

నాగబాబుకు పడవి హిట్లు

మెగా బ్రదర్స్ అయిన చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లో నాగబాబు దురదృష్టవంతుడనే చెప్పాలి. అన్న, తమ్ముడు స్టార్ హీరోలే.. అతని అన్న కొడుకు కూడా స్టార్ హీరో అయినా తను మాత్రం ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయాడు. చిరంజీవి చిత్రసీమను ఏలుతున్న రోజుల్లో ఆయనతో పాటు నాగబాబు కూడా చిత్రాల్లో నటించడం మొదలు పెట్టారు. కానీ నటన ఆయనకు అంతగా కలిసి రాలేదు. దీంతో ‘అంజనా ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ పెట్టి చిత్ర నిర్మాణ రంగం వైపు దృష్టి సారించాడు నాగబాబు. చిరంజీవి వరుస హిట్లు పడుతున్న రోజుల్లో తన బ్యానర్ లో అన్నయ్య నటించాలని కోరాడు నాగబాబు. కానీ ఇక్కడ కూడా నాగబాబును దురదృష్టం వెంటాడింది.

తన బ్యానర్ లో గుడుంబా శంకర్

వరుస హిట్లతో దూసుకుపోతున్న చిరంజీవి కూడా ‘అంజనా ప్రొడక్షన్’ బ్యానర్ లో తీసిన మూడు చిత్రాలు (రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు) ఫ్లాప్ అయ్యాయి. ఒక్క బావగారు బాగున్నా మాత్రమే కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా లాభాలు మాత్రం తెచ్చిపెట్టేలేక పోయింది. ఇక తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి తన బ్యానర్ లో గుడుంబా శంకర్ మూవీ తీశాడు నాగబాబు. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తర్వాత జనరేషన్ లో అయినా అదృష్టం వరిస్తుందా అనుకున్నాడో ఏమో.. రాంచరణ్ తో కలిసి ‘ఆరంజ్’ మూవీ తీశాడు. దీంతో ఇక నాగబాబు రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరంజ్ ఒక డిజాస్టర్ గా మిగిలిపోయింది. అప్పులు మిగిలిపోయాయి.

ఆదుకున్న పవన్

అప్పుల ఊబిలో చిక్కుకున్న తనను కొంతలో కొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడని అప్పట్లో నాగబాబు చెప్పుకచ్చారు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు ముగ్గురు చేతిలో ఉన్నా పాపం నాగబాబుకు మాత్రం ఒక్క హిట్టు ఇవ్వలేకపోయారు. ఇక అప్పులతో సతమతం అవుతుండగా జబర్దస్త్ లాంటి షోలు చేసుకుంటూ మెల్లమెల్లగా అప్పులు కట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్న నాగబాబుకు తన కొడుకు వరుణ్ తేజ్ మీరోగా ఎదగడంతో ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకున్నారట.

ఆరంజ్ తో కోలుకోలేని దెబ్బ

నాగబాబును దాదాపు రోడ్డు మీదకు తెచ్చిన సినిమా ఆరెంజ్. అయితే ఇటీవల ఒక సందర్భంలో నాగబాబు మాట్లాడుతూ ఆరంజ్ ఒక కల్ట్ మూవీ అన్నారు. త్వరలో రీ రిలీజ్ కూడా చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు. ఈ చిత్రం విడుదలై 12 సంవత్సరాలు పూర్తయ్యాయని అభిమానుల కోరికతో మరోసారి రిలీజ్ చేయాలని చూస్తున్నానని నాగబాబు చెప్పుకచ్చాడు. ఈ మూవీకి డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కాగా మ్యూజిక్ డైరెక్టర్ గా హరీష్ జైరాజ్ వ్యవహరించారు.