కాస్టింగ్ కౌచ్ లో తప్పేముంది.. విష్ణుప్రియ

0
4137

విష్ణుప్రియ బుల్లితెరకు పరిచయం లేని యాంకర్. దాదాపు తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడి గురించి పరిచయం కూడా అక్కర్లేదు. అందం, అభినయంతో చాలా షోలలో యాంకర్ గా చేస్తూ గుర్తింపు దక్కించుకుంది. ఈ టీవీలో గతంలో వచ్చిన ‘పోవే పోరా’ షోతో సుడిగాలి సుధీర్ తో స్టేజీ పంచుకొని యాంకర్ గా గుర్తింపు దక్కించుకుంది. పొట్టి పొట్టి దుస్తులతో తెగ గ్లామర్ షోలను చేస్తుంది ఈ సొగసరి. శ్రీముఖితో ఆమె వెకేషన్ సందడి అంతా ఇంతా కదనే చెప్పాలి. ‘చెక్ మేట్’ సినిమాతో మొదటి సారి వెండితెరకు పరిచమైంది ఈ పొడుగరి.

వెండితెరపై సైతం అమ్మడి సందడి

యాంకర్ గా షోలలో కాకుండా పెద్ద పెద్ద ఈవెంట్లలో కూడా రాణిస్తుంది ఈ చిన్నది. ఈ టీవీలోని శ్రీదేవీ డ్రామా కంపెనీలో రష్మీతో కలిసి సందడి చేసింది. పండుగల వేళ ప్రత్యేక కార్యక్రమాలలో ఎక్కువగా కనిపిస్తుంది విష్ణుప్రియ. ఈమెకు ఒక చెల్లెలు కూడా ఉంది. సుడిగాలి సుధీర్ తో కిలిసి చేసిన ఒక ప్రోగ్రామ్ కు వచ్చిన ఆమె విష్ణు ప్రియ గురించి కొన్ని విషయాలు కూడా చెప్పింది.

పోవే పోరాతో యాంకర్ గా సెటిలైన ఈ భామకు డ్యాన్స్ పై కూడా మంచి పట్టు ఉంది. శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరించిన ఒక షోలో మరో ఇద్దరు యాంకర్లతో కలిసి విష్ణుప్రియ డ్యాన్స్ చేసిన తీరును ఆడియన్స్ ను దృష్టి మరల్చకుండా చేసింది. బాహుబలిలో ‘ఇరుక్కుపో’ అనే పాటలో నడుం అందాలను పూర్తిగా చూపించింది. ఈ పాట అప్పట్లో చాలా వైరల్ అయ్యింది.

కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన విష్ణుప్రియ

ఈ అమ్మడు కూడా కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను కూడా ఇండస్ర్టీకి వచ్చిన తొలినాళ్లలో కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కున్నానని చెప్పింది. అయితే ‘కమిట్ మెంట్ ఇవ్వడం ఇష్టం లేక వెళ్లిపోయానని, తర్వాత నాలోని ప్రతిభను చూసి కొందరు ఛాన్స్ ఇచ్చార’ని చెప్పింది. ఇదే కాకుండా ఇద్దరి ఇష్టంతో జరిగే పనిలో ఎలాంటి తప్పులేదని చెప్పింది. ఒకరు ఇష్టంగా కమిట్ మెంట్ ఇస్తే దానిలో ఇష్టమే చూడాలని కానీ కాస్టింగ్ కౌచ్ గా చూడకూడదని సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.

భిన్నాభిప్రాయంలో నెటిజన్లు

ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఈ అమ్మడి మాటలతో ఇండస్ర్టీలో మరో సారి కాస్టింగ్ కౌచ్ పై తీవ్ర దుమారం రేగింది. అది తప్పనే చాలా మంది అంటుంటే ఇలా కాస్టింగ్ కౌచ్ పై పాజిటివ్ ఓపీనియన్ ఇవ్వాల్సిన పనిలేదని కొందరు కో ఆర్టిస్టులు గట్టిగానే మందలిస్తున్నారట. నెటిజన్లు కూడా అమ్మడి మాటలపై భిన్నంగా అభిప్రయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఇండస్ర్టీకి ఇబ్బందులు తలెత్తుతాయని కొందరంటే. విష్ణు ప్రియ చెప్పన మాటల్లో నిజం ఉందని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ టాపిక్ ఇప్పుడు బుల్లితెర, వెండితెరను కూడా తాకింది.