విజువల్ వండర్ అవతార్ ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేడు. అంతకంటే ఎక్కువ గ్రాఫిక్స్ ఈ నెల 16న విడుదలయ్యే అవతార్ సీక్వెల్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. ఈ సినిమా విడుదలకు ముందే ఎంతో హైప్ క్రియేట్ చేసింది. అవతార్ కంటే కూడా భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కించినట్లు జేమ్స్ చెప్పాడు. ఈ చిత్రానికి పోటీగా టాలీవుడ్ మార్కట్ లో కూడా ఎలాంటి సినిమాలు రిలీజ్ చేయలేదు నిర్మాతలు.
నెగెటివ్ పబ్లిసిటీతో రెచ్చిపోతున్న వైరల్ రాయుళ్లు
అయితే ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’పై ఇప్పుడు నెగెటివ్ పబ్లిసిటీ మొదలైంది. కొన్ని రోజులుగా ఈ గాసిప్ రాయుళ్లు ఇలా ఇండియన్, ప్రాంతీయ సినిమాలకు నెగెటివ్ రివ్యూస్ ఇస్తూనే ఉన్నారు. కానీ ఇంత పెద్ద హాలీవుడ్ విజువల్ వండరైన అవతార్ కూడా వీరి భారిన పడిందని ప్రస్తుతం తెలుస్తోంది.
అవతార్ 1 రికార్డు బ్రేక్ చేస్తుందా
దాదాపు 13 సంవత్సరాల క్రితం వచ్చిన అవతార్ ఎంతటి సంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా నిరాజనాలు అందాయి. భారీగా వసూళ్లు చేసి బాక్సాఫీస్ లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ సినిమాకు పోటీగా వచ్చిన ఏ సినిమా కూడా దీని ధాటికి తట్టుకోలేక బోల్తా పడ్డాయి. అప్పుటి వార్తల్లో ప్రత్యేకంగా నిలిచింది అవతార్.
ఎక్కువ భాగం నీటిలోనే
జేమ్స్ కెమెరాన్ కు సముద్రం అంటే చాలా ఇష్టమట. ఎక్కువ సమయం బీచ్ లలో గడుపుతుంటారట. ఆయన తీసిన కొన్ని సినిమాలలో సముద్రం కూడా కీ రోల్ పోషించిందంటే అతిశయోక్తి కాదు. టైటానిక్ ఆయనకు ఎంతటి గుర్తింపు తెచ్చిందో మనందరికీ తెలిసిందే. ఇదే కోణంలో అవతార్ 2కు కూడా ది వే ఆఫ్ వాటర్ అంటూ ట్యాగ్ యాడ్ చేశాడు కేమరూన్.
అధునాత సాంకేతికతతో
ఈ సినిమా దాదాపు ఎక్కువగా నీటిలోనే కొనసాగుతుంది. అక్కడ కూడా వింత వింత జీవువను సృష్టించాడు కేమరూన్. ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎవరూ వాడని ఎఫెక్స్ట్ ను ఈ చిత్రంలో చూపించారట కేమరూన్. ప్రపంచంలోని చాలా భాషల్లో ఏకధాటిగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట కేమరూన్.
నెట్టింట్లో నెగెటివ్ రివ్యూస్
ఇప్పుడు ఈ సినిమాపై నెట్టింట్లో కొన్ని రివ్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ నెగెటివ్ గా ఉండడం గమనార్హమనే చెప్పాలి. అసలు ఇప్పటి వరకూ విడుదల కాని సినిమా గురించి ఊహించి చెప్పడం. అదికూడా నెగెటివ్ గా రివ్వ్యూ ఇవ్వడంపై సినీ అభిమానులు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారట. కానీ సినీ విశ్లేషకులు మాత్రం అవతార్ 2 మరో ప్రభంజనం సృష్టించడం ఖామయని జోస్యం చెబుతున్నారు. వేలాది కోట్లను ఖర్చు చేసిన ఈ సినిమా ఎన్ని వండర్లు క్రియేట్ చేస్తుండో డిసెంబర్ 16 వరకూ ఆగి చూడాల్సిందే.