భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న శృతి హాసన్

0
822

ఇండస్ట్రీలో హీరోయిన్లు అరుదైన జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం చిత్ర రంగాన్ని ఈ సమస్య పట్టి పీడిస్తుండనే చెప్పాలి. ఇప్పిటికే స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ తో బాధపడుతుండగా, అలాంటి కోవలోకే చెందిన వ్యాధితో మరో ఫేమస్ హీరోయిన్ కూడా బాధపడుతుంది. వయోసైటిస్ తో తన రూపాన్ని కోల్పోయింది. ఈ మధ్య శాకుతలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సమంతను చూసిన అభిమానులు ఆవేదన చెందారు. ఈమెతో పాటు నటి కల్పిక గణేశ్ కూడా మయోసైటిస్ తో బాధపడుతున్నానని క్లారిటీ ఇచ్చింది.

అరుదైన వ్యధికి గురైన శృతి హాసన్

వీరితో పాటు బిగ్ బాస్ ఫేం పునర్నవి భూపాలం తను కూడా ఈ మధ్యే ఒక వ్యాధి బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా చెప్పుకచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించిన శృతి హాసన్ తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. చాలా సినిమాలు కూడా బాక్సాఫీస్ హిట్లుగా నిలిచిపోయాయి.

తండ్రి పేరును వాడకుండానే సొంతంగా నటనలో దూసుకుపోతున్న ఆమెకు అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఆమె నటించిన సినిమాల్లో బ్రేక్ ఇచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ తో చేసిన ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకొని ఒక వెలుగు వెలిగారు శృతి హాసన్.

వాల్తేరు వీరయ్య ప్రీ ఈవెంట్ కు అందుకే రాలేదు

చాలా రోజులుగా శృతి హాసన్ సినిమాలు చేయడం లేదు. కానీ ఇటీవల ఇద్దరు స్టార్ హీరోలతో టాలీవుడ్ లో రెండు సినిమాలను చేసింది. నట సింహం బాలకృష్ణకు జోడీగా ‘వీరసింహారెడ్డి’ ఒకటి అయితే మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ రెండోది. ఇలా రెండు చిత్రాల్లో పెద్ద స్టార్లతో కలిసి నటించారు ఆమె. ఈ రెండు సినిమాలు కూడా ఒక్క రోజు వ్యవధిలోనే రిలీజ్ అయ్యాయి.

వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బాలకృష్ణతో కలిసి ఒంగోలుకు వెళ్లింది శృతి హాసన్. ఆ తర్వాత వైజాగ్ లో నిర్వహించిన వాల్తేరు వీరయ్య ఈ వెంట్ లో మాత్రం ఆమె కనిపించలేదు. తనకు హెల్త్ బాగాలేదని అందుకే రాలేదని చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ట్రీట్ మెంట్ తీసుకుంటున్న శృతి హాసన్

శృతి హాజన్ కు మొదటి నుంచే కోపం ఎక్కువట. ఇక ఈ వ్యాధి సోకడంతో అది మరింత ఎక్కువైందట. ఎవరైనా ఆమెకు నచ్చని పనులు చేసినా.. విసుగు తెప్పించినా.. ఎదుటి వారు ఎవరన్నదీ పట్టించుకోదట. ఆ సమయంలో ఆమె ప్రవర్తన చాలా వింతగా మారిపోతుందట. చెమటలు పట్టడం, వింతగా ప్రవర్తించడం లాంటివి గమనించిన శృతి హాసన్ ఈ మధ్యనే తనలో మార్పులను గమనించారట. దీనికి కారణం తెలుసుకొని ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం.