‘సలార్’ మూవీ ఫుల్ రివ్యూ..కేజీఎఫ్ కి మించిన యాక్షన్

0
465
salaar review ap messenger

నటీనటులు : ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, శ్రీయా రెడ్డి , బాబీ సింహా తదితరులు.

దర్శకత్వం : ప్రశాంత్ నీల్
సంగీతం : రవి బర్సుర్
బ్యానర్ : హోమబుల్ ఎంటర్టైన్మెంట్స్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం కోసం అభిమానులతో పాటుగా ఆడియన్స్ కూడా ఎంత ఆతృతగా ఎదురు చూసారో మన అందరికీ తెలిసిందే. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ప్రశాంత్ నీల్ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ తో సినిమా చేసినప్పుడు అలాంటి అంచనాలు ఉండడం సహజం.

టీజర్, ట్రైలర్స్ తో ఆడియన్స్ లో అంచనాలను రేపిన ఈ చిత్రం విడుదల తర్వాత నేడు ఎలాంటి రెస్పాన్స్ ని దక్కించుకుందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.

salaar review ap messenger

ఒక్క రాత్రిలో ‘సలార్’ రికార్డ్స్ చూస్తే నోరెళ్లబెడుతారు

కథ :

దేవా (ప్రభాస్) ఒక సాధారణ మెకానిక్..తన తల్లి తో కలిసి అస్సోమ్ లోని ఒక ప్రాంతం లో సాధారమైన జీవితం ని గడుపుతూ ఉంటాడు. అతనికి ఆద్య (శృతి హాసన్) అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడుతారు.

అయితే ఒక రోజు కన్సార్ నగరానికి చెందిన వర్ధరాజ్ మన్నార్ (పృథ్వీ రాజ్) మనుషులు ఆద్య ని వెంటాడు వస్తారు. వాళ్ళ నుండి దేవా ఆద్య ని కాపాడుతాడు. కానీ అప్పుడే తెలుస్తుంది దేవా మరియు వర్ధరాజ్ మన్నార్ గతం లో ప్రాణ స్నేహితులు అని.

అంత ప్రాణ స్నేహితులుగా బ్రతికిన ఈ ఇద్దరు ఎందుకు భద్ర శత్రువులుగా మారారు?, అసలు వర్ధరాజ్ మన్నార్ ఆద్య ని ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడు?, చివరికి ఈ ప్రాణ స్నేహితులిద్దరు కలిసిపోతారా, లేకపోతే భద్ర శత్రువులు గానే మిగిలిపోతారా? అనేది మిగిలిన స్టోరీ.

విశ్లేషణ :

సినిమా ఫస్ట్ హాఫ్ లో స్టోరీ డెవలప్ చేసుకుంటూనే, క్యారెక్టర్స్ ని చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడు ప్రశాంత్ నీల్. ఫస్ట్ హాఫ్ మొత్తం సస్పెన్స్ తో సాగుతుంది. ప్రారంభ సన్నివేశాల్లోనే ప్రభాస్ మరియు పృథ్వీ రాజ్ సుకుమారన్ బాల్యం ని అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.

ఆ తర్వాత సినిమా ప్రారంభమైన 30 నిమిషాలకు ప్రభాస్ ఎంటర్ అవుతాడు. అక్కడి నుండి మామూలు మనిషి లాగానే చాలా తగ్గి ఉంటాడు కానీ, ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం నుండి ఇంటర్వెల్ సన్నివేశం వరకు ప్రభాస్ కటౌట్ ని ఎలా వాడాలో అలా వాడుకున్నాడు.

ముఖ్యంగా కోల్ మైన్ లో ఫైట్ సీన్ అయితే ఫ్యాన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేసాయి. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కి ఇలాంటి యాక్షన్ సన్నివేశం రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక సెకండ్ హాఫ్ కాస్త స్లో గా ఉంది, పెద్దగా ఎలివేషన్స్ లేవు అని అనిపించినా, డ్రామా మాత్రం చాలా చక్కగా రాసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇవన్నీ సలార్ రెండవ భాగానికి మంచి లీడ్స్ గా ఉంటాయి. ఇక చివరి 40 నిమిషాలు మరియు క్లైమాక్స్ సన్నివేశం లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ అయ్యేలా చేస్తుంది.

అంతా బాగానే ఉంది కానీ, మ్యూజిక్ డైరెక్టర్ రవి బర్సుర్ సరిగా డ్యూటీ చేసి ఉంటే యాక్షన్ సన్నివేశాలు మరో లెవెల్ కి వెళ్ళేవి అని చాలా మందికి అనిపిస్తుంది. ముఖ్యంగా కోల్ మైన్ ఫైటింగ్ ఆ రేంజ్ లో ఉన్నప్పటికీ కూడా రవి బర్సుర్ అందించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కారణంగా నిరాశ చెందాల్సి వస్తుంది.

చివరి మాట :

చాలా కాలం తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సరైన కంటెంట్ మూవీ. ఫ్యాన్స్ కి అయితే పండగే, ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. సినిమా వెయ్యి కోట్ల రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది మాత్రం చూడాలి.

రేటింగ్ : 3.5/5