ఇద్దరు నిర్మాతల కెరీర్‌ను క్లోజ్‌ చేసిన కాంబినేషన్‌ మహేష్‌`త్రివిక్రమ్‌లది..

0
336
Mahesh Trivikrams combination closed the career of two producers

ఓవైపు తెలుగు సినిమాకు బాక్సాఫీస్‌ నడకలు నేర్పిన సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, మరోవైపు తమ సంస్థ ఆస్థాన స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌..

ఇంకోవైపు ట్రెండీ స్టార్‌ హీరోయిన్‌ శ్రీలీల ఇది కదా అసలు సినిమా కాంబనేష్‌ను అంటే అనుకున్నాడు హారిక`హాసిని బ్యానర్‌ అధినేత, నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్‌ చినబాబు.

అంతే ‘గుంటూరు కారం’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేశారు. సంక్రాంతి బరిలోకి దూకిన ఈ భారీ బడ్జెట్‌ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పక్కా మాస్‌ క్యారెక్టర్‌తో మహేష్‌ అభిమానులను అలరించగా, సామాన్య ప్రేక్షకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణకు సంక్రాంతి మొనగాడు అనే సెంటిమెంట్‌ ఉంది.

అది మహేష్‌కు కూడా వచ్చింది. దాన్ని బేస్‌ చేసుకుని ఈ సినిమా సూపర్‌హిట్‌ అవుతుందని మహేష్‌ కాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. కానీ అతని ఆశ నెరవేరలేదనే చెప్పాలి.

ముందు నుంచీ ఈసినిమా విషయంలో ఓ సెంటిమెంట్‌ నిర్మాత చినబాబును వెంటాడుతూనే ఉంది. అదేంటంటే మహేష్‌`త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన రెండు సినిమాలతో ఆ నిర్మాతల కెరీర్‌ క్లోజ్‌ అయిపోయింది.

ఈ సెంటిమెంట్‌ చినబాబును టెన్షన్‌ పెడుతూనే ఉంది. మహేష్‌`త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తొలిసినిమా ‘అతడు’ తర్వాత ఆ సినిమా నిర్మాత, నటుడు మురళీమోహన్‌ నిర్మాణానికి స్వస్తి పలికారు.

Mahesh says lets hit hard

అలాగే ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖలేజా’ సినిమాతో అప్పటి స్టార్‌ ప్రొడ్యూసర్‌, ఫైనాన్సర్‌ శింగనమల రమేష్‌ కూడా సినిమాలకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. ఇలా ఇద్దరు నిర్మాతల కెరీర్‌ను క్లోజ్‌ చేసిన కాంబినేషన్‌ మహేష్‌`త్రివిక్రమ్‌లది.

ఆ కారణంగానే ఈ సినిమా ప్రారంభం నుంచీ బయ్యర్లు కూడా కొంత డైలమాలో ఉన్నారు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్‌ స్థాయి మంచి రేంజ్‌కు చేరడం.. మహేష్‌ కూడా గతంలోకంటే మరింత హైట్స్‌కు ఎదగడంతో బయ్యర్లు ముందుకొచ్చారు.

‘గుంటూరు కారం’తోనే విడుదలైన ‘హను`మాన్‌’ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడం, శనివారం వెంకటేష్‌ ‘సైంధవ్‌’, ఆదివారం నాగార్జున ‘నా సామిరంగ’లు రానుండడంతో వాటి టాక్‌ను బట్టి గుంటూరుకారం ఘాటు డిసైడ్‌ అవుతుంది.

అయితే ప్రస్తుతం సంక్రాంతి సీజన్‌ కావడంతో ఈ మూడు, నాలుగు రోజులు కలెక్షన్స్‌పై ఆ సినిమాలు ఏ స్థాయి ప్రభావం చూపిస్తాయో అనే దానిపై నిర్మాత చినబాబు మల్లగుల్లాలు పడుతున్నారు.