పవిత్రా లోకేష్ ఐఏఎస్ చదవకుండా అడ్డుకున్నది ఎవరూ.. ఈ పరిస్థితులకు బాధ్యులు వారేనా..!!

0
202
No one stopped Pavitra Lokesh from studying IAS Are they responsible for this situation

క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేశ్ గురించి సంవత్సరం నుంచి బాగా వింటున్నాం. ఆమె చేసే పాత్రల గురించి కంటే ఆమె సీనియర్ నటుడు నరేశ్ తో పెట్టుకన్న ఎఫైర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం చాలా విమర్శలు ఎదుర్కొంటుంది ఆమె. ఇంత సాంప్రదాయంగా ఉన్న ఆమె ఇలాంటి పనులు చేస్తుంది అంటూ ఆమెను విమర్శిస్తున్నారు.

దీనికి తోడు రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె ఇప్పుడు నరేశ్ తో మూడో పెళ్లికి సిద్ధం కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీన్ని కొంచెం పక్కన పెట్టి పవిత్రా లోకేశ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌడ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పవిత్ర తండ్రి కూడా నటుడే..

పవిత్ర లోకేశ్ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందింది. పవిత్ర పుట్టింది కర్ణాటకలో. ఆమెది కళాకారుల కుటుంబం ఆమె తండ్రి మైసూర్ లోకేశ్ కన్నడ చిత్రాల్లో నటుడు.

తండ్రిని చూస్తూ పెరిగిన ఆమె తన తండ్రితో అప్పుడప్పుడూ షూటింగ్ లకు కూడా వెళ్లేది. తాను చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలని అనుకునేంది.

కానీ నాన్నతో అప్పుడప్పుడూ షూటింగ్ లకు వెళ్లడంతో ఆమె ఇంట్రస్ట్ క్రమంగా మారుతూ వచ్చింది. తర్వాత కొంత కాలానికి తన తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు తనపై పడ్డాయి.

Chiranjeevi was shocked by Krantikumars insults

దీంతో లక్ష్యాన్ని పక్కన పెట్టి డబ్బు కోసం అన్వేషించసాగింది. అందులో భాగంగానే చిత్రాల్లో నటించాలని అనుకుంది. మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. తర్వాత హీరోయిన్ గా కూడా చేసింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలైంది.

హీరోయిన్ గా కూడా రాణించిన పవిత్రా లోకేశ్

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఒకవైపు సివిల్స్ కు ప్రిపేరవుతూనే చిన్న చిన్న పాత్రలు వేసింది. కొన్ని రోజులకు చదువును పూర్తిగా పక్కన పెట్టింది. క్రమ క్రమంగా హీరోయిన్ గా అవకాశాలు వస్తుండడంతో ఆమె రేంజ్ బాగా పెరిగింది.

ఇలా కొనసాగుతున్న సమయంలో ఆమె హైట్, పర్సనాలిటీపై దర్శకులు, నిర్మాతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు ఇష్టపడలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే తీసుకోవడం మొదలు పెట్టారు.

ఐఏఎస్ కావాల్సిన పవిత్రా లోకేశ్

ఇక తర్వాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలయ్యారు. మంచి మంచి హోమ్లీ పాత్రలు చేస్తూ గుర్తింపు సంపాదించుకున్న పవిత్రా లోకేశ్. మొదట గ్లామరస్ హీరోయిన్ గా ఉర్రూతలూగించిన వారే.

రీసెంట్ గా నరేశ్ తో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటూ లిప్ లాక్ లాంటి వీడియోలతో సంచలనాలు సృష్టిస్తున్నారు. కలెక్టర్ కావాలనుకున్న పవిత్ర ఇలాంటి పనులు చేస్తూ కుటుంబం పరువు తీస్తుందని ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీ లో కూడా మండిపడుతున్నారట.

ఏది ఏమైనా దంపతులను విడగొట్టి మారీ పెళ్లి చేసుకోవడం సరైన పద్ధతి కాదని సూచిస్తున్నారు. వీరి వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి మరి.