యంగ్ టైగర్ న్యూ లుక్.. హీటెక్కుతున్న సెర్చ్ ఇంజిన్

0
1403

ఎప్పటి కప్పుడు మూవీని బట్టి న్యూ లుక్స్ చూపించడం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కొత్తేమి కాదు. ‘నాన్నకు ప్రేమతో’లో క్లాస్ లుక్స్ లో మెరిసిన యంగ్ హీరో లుక్స్ ను మరింత మార్చాడు. రీసెంట్ స్టైలిస్ లుక్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడంతో.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్రహ్మరథం

తన లాస్ట్ ప్రాజెక్టు ‘త్రిపుల్ ఆర్’ తర్వాత యంగ్ హీరో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. రీసెంట్ గా ఈ మూవీ జపాన్ లో కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. అక్కడ కూడా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఆయన ఫేం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. జపాన్ లో ఆయనకు అభిమానులు, అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా అక్కడికి వెళ్లిన చిత్ర యూనిట్ కు అక్కడి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు.

ప్రోడక్ట్ ను ప్రమోట్ చేసేందుకు స్టైలిస్ లుక్స్

ప్రస్తుతం ఎన్టీఆర్ న్యూ ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్-30’ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చక చకా సాగుతున్నాయి. దీని రిలీజ్ కు కొంచెం టైం ఉండడంతో ఆయన ఓ యాడ్ షూట్ చేయబోతున్నారని ఇండస్ర్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం ఆయన ఆ షూటింగ్ లో భాగంగానే లుక్స్ ఛేంజ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక ప్రోడక్ట్ ను ప్రమోట్ చేసేందుకు స్టైలిస్ లుక్స్ లో కనిపిస్తున్నారని, మూవీ కోసం కాదని చిత్ర వర్గాలు చెప్తున్నాయి.

బ్లాక్ సూట్ వేసుకొని క్లాస్ లుక్ లో

ఎన్టీఆర్ న్యూ లుక్ కోసం ఆయన ఫ్యాన్స్ సెర్చింజన్లను హీటెక్కిస్తున్నారు. స్టార్ అడ్వర్ టైజ్ మెంట్ ఫొటో గ్రాఫర్ అవినాష్ గోవారికర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ పిక్స్ ను షేర్ చేశారు. మోనోక్రోమ్ పిక్చర్ లో గ్లాసెస్ ధరించి, బ్లాక్ సూట్ వేసుకొని క్లాస్ లుక్ లో ఎన్టీఆర్ మెరిపోతున్నారు. మ్యాన్ ఆఫ్ ద మాస్ గా ఇమేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ క్లాస్ లుక్స్ తో అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మా హీరో ఎందులో అయినా రాణిస్తాడని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మాస్, క్లాస్ కలబోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు.

ఈ ప్రాజెక్టుకు ‘ఎన్టీఆర్ 30’ గా

ఎన్టీఆర్ తర్వాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో వస్తుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు సంబంధించి మరే కొత్త ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లలేదు. రీసెంట్ గా ఒక కథతో కొరటాల శివ, ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ను కలిశారని తెలిసింది. కొరటాల, ఎన్టీఆర్ కాంబోలో ‘జనతా గ్యారేజ్’ రాగా అభిమానులు దీనికి బాక్సాఫీస్ హిట్ ఇచ్చారు. రీసెంట్ గా ఈ డైరెక్టర్ తో మరో మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్టుకు ‘ఎన్టీఆర్ 30’ గా రాబోతోంది.

వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు

ఇక కొరటాల శివ తన చివరి చిత్రం ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోకపోవడంతో ఈ మూవీపై బాగానే కసరత్తు చేశారట. పక్కా హిట్ పడేలా కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇది కాస్త లేట్ అవుతుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుథ్ ను తీసుకున్నారు. రీసెంట్ గా వారి సిట్టింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకచ్చేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఇక యంగ్ హీరో మరో ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్ 31’ 2024లో ప్రారంభం కావచ్చని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.