జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’.. ఫ్యాన్స్ లో తీవ్ర నిరాశ

0
1398

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రిలీజ్ డేట్ ను ఎట్టకేలకు ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే ఇంకా షూటింగ్ కొంత పూర్తి కావాల్సి ఉండగా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని చిత్ర యూనిట్ చెప్తుంది. చిత్రం రిలీజ్ డేట్ పై మాత్రం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మాత్రం కొంత నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. చిత్రం విడుదలలో భాగంగా ఓపినింగ్స్ నుంచి ఫుల్ రన్ టైం వరకూ భారీగా ఏర్పాట్లు ఉండాలని కోరుకున్న వారి ఆశలపై మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నీళ్లు చల్లింది.

ఇప్పటికే థియేటర్లు బుక్

వాల్తేరు వీరయ్యకు పోటీగా రెండు చిత్రాలు విడుదలవుతున్నాయి. అందులో ఒకటి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ కాగా మరొకటి డబ్బింగ్ చిత్రం ‘వారసుడు’. వారసుడు చిత్రాన్ని దిల్ రాజు తన బ్యానర్ లో రిలీజ్ చేస్తున్నారు. బాలకృష్ణ సినిమాతో పాటు డబ్బిగ్ సినిమాలకు ఇప్పటికే థియేటర్లను కూడా బుక్ చేశారు. ఈ కోణంలో చూస్తే ‘వాల్తేరు వీరయ్య’కు పెద్దగా థియేటర్స్ దొరికే ఛాన్స్ లేవు. కేవలం 40 శాతం మాత్రమే దొరుకుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ బాబీ, నిర్మాతలు జనవరి 11వ తేదీన విడుదల చేద్దామని చిరంజీవికి చెప్పారు. కానీ ఇది 13నే విడుదల చేయాలని చిరంజీవి పట్టుబడుతున్నారు.

భారీ ఓపినింగ్స్ మిస్సవుతున్న ‘వాల్తేరు వీరయ్య’

రిలీజ్ విషయంలో ఆయన మాటే ఫైనల్ కాబట్టి వారు కూడా 13నే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి బుధవారం ప్రకటించారు. దర్శకుడు, నిర్మాత చెప్పినట్లుగా 11న రిలీజ్ చేస్తే వీరసింహారెడ్డి, వారసుడు ఏదైనా సినిమా ఫ్లాప్ టాక్ వస్తే మరిన్ని థియేటర్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మిగిలిన 40 శాతం థియేటర్లలో మాత్రమే ‘వాల్తేరు వీరయ్య’ విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ ఒకే బ్యానర్ పైనే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి గుడ్డిలో మెల్లలా థియేటర్లను సర్ధుకోవచ్చు. వాల్తేరు వీరయ్య బిజినెస్ చాలా ఎక్కువ. అది బ్రేక్ ఈవెన్ సృష్టించే స్టేషన్ అందుకోవాలంటే రూ. 110 కోట్ల షేర్ రాబట్టాలి. అందుకోసమే ఓపెనింగ్ పై ప్రధానంగా దృష్టి పెట్టాలి.

ఈ సారి బరిలో స్టార్ హీరోలు

40 శాతం థియేటర్లలో రిలీజైతే చిరంజీవి రేంజ్ ఓపినింగ్ మిస్సవుతుందని ఆయన ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. అభిమానులను నిరాశ పరచకుండా కావాల్సినన్ని థియేటర్స్ ను సర్ధుబాటు చేసే విషయంలో నిర్మాతలు ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి మరి. చాలా వరకు బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలు సంక్రాంతి బరిలో నువ్వా.. నేనా.. అనే పోటీలో కొనసాగుతాయి. గతంలో కూడా చాలా చిత్రాలు సంక్రాంతి బరిలోనే పోటీకి దిగగా కొన్ని సార్లు బాలయ్య, మరికొన్ని సార్లు చిరంజీవి పై చేయిగా నిలిచారు. ఈ సారి సంక్రాంతికి ఎవరి సినిమా హిట్టవుతుందో.. ఎవరి సినిమాకు ప్రశంసలు దక్కుతాయో చూడాలి. జనవరి 13 వరకూ వేయిట్ చేయక తప్పదు.