వారిద్దరితో అప్పుడే పెళ్లి జరిగింది.. తమన్నా సంచలన కామెంట్స్

0
1363

సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్లలో తమన్నా ఒకరు. హ్యాపీడేస్ తో అందాలతో సందడి చేసే ఈ బ్యూటీ అంచలంచలుగా ఎదుగుతూ వస్తోంది. సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకుంటూ పోతోంది. దీంతో పాటు ఇప్పుడున్న యంగ్ హీరోలతో కూడా జతకడుతుంది ఈ చిన్నది. ప్రతీ సంవత్సరం ఇండస్ర్టీకి యంగ్ హీరోయిన్స్ వస్తున్నా ఆమె మాత్రం ఇంకా డిమాండ్ తగ్గలేదు. ప్రస్తుతం తమన్నా 3 ఓటీటీ మూవీస్ లో నటిస్తోంది. వీటితో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా మెగాస్టార్ చింరజీవి సరసన కూడా నటిస్తోంది.

ఇద్దరితో పెళ్లి జరిగిపోయింది

వీటితో పాటు మరో మలయాళ సినిమా కూడా ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నాయి. తమన్నా పెళ్లిపై కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఆమె తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నా పెళ్లిపై ఇంట్లో వారు కూడా ఒత్తిడి తెస్తున్న మాట వాస్తవం, సంబంధాలు కూడా చూస్తున్నారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే బాధపడాలో నవ్వాలో అర్థం కావడం లేదు.

పెళ్లి విషయం సీక్రెట్ గా ఉంచను

మొదట్లో ఓ పారిశ్రామిక వ్యక్తితో పెళ్లి జరిగిందని రాశారు.. తర్వాత ఒక స్టార్ హీరో కూడా జరిగిందని రాశారు. నేను ఒకే ఎందరిని పెళ్లి చేసుకున్నానో నాకే తెలియదు. ఈ రెండు వార్తల్లో ఏది కూడా నిజం కాదు. నాకు పెళ్లి అయితే తప్పకుండా అందరికీ చెప్తాను. అంత వరకూ ఓపిక పట్టండి.. మీకు తోచినవారితో నాకు పెళ్లిచేయకండి’ అన్నారు. ఇక పెళ్లి విషయం సీక్రెట్ ఉంచాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. నా ఫ్యాన్స్, కో ఆర్టిస్టులు, ఇండస్ర్టీకి తప్పకుండా చెప్తాను అంటూ చెప్పింది.

గుర్తుందా శీతాకాలం

తమన్నా హీరోయిన్ గా సత్యదేవ్ తో కలిసి వస్తున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’ డిసెంబర్ 9న థియెటికల్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమా చాలా బాగుంటుందని, ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుందని చెప్పారు తమన్నా. కన్నడ చిత్రం ‘లవ్ మాక్ టైల్’కు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. కన్నడలో బాక్సాఫీస్ హిట్ తిరగరాసిన చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పింది చిత్రం యూనిట్. ఇది బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందో లేదో చూడాలి మరి.