‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాసికల్ లుక్స్ అందరినీ అలరించాయి. బ్రాండ్ కోట్, ఐ గ్లాస్, చక్కటి సంభాషణలతో ఆ చిత్రంలో మెరిపించాడు ఎన్టీఆర్. ఈ ప్రస్తావన ఎందుకంటే యంగ్ టైగర్ ఇటీవల ఒక యాడ్ షూట్ లో కనిపించారు. ఆయన లుక్స్ ఇప్పుడు నెట్టింట్ల వైరల్ అవుతున్నాయి. ఇంతకీ దీని కోసం ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఇక్కడ చూద్దాం.
యాడ్స్ తో తారక్ బిజీ
త్రిపుల్ ఆర్ సినిమా విజయం సాధించడంతో వరల్డ్ వైడ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ రిలీజై సంచలనాలే సృష్టించింది. అయితే దీన్ని ఇటీవల జపాన్ లో విడుదల చేయగా అక్కడ కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది. దీంతో ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన తర్వాతి ప్రాజెక్టులు ఇంకా ఒకే కాలేదు. దీంతో ఈ గ్యాప్ లో ఆయన ఓ యాడ్ లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. యాడ్ కు సంబంధించి ఫొటోలు ఇటీవల నెట్టింట్లో వైరల్ కూడా అయ్యాయి.
రెండు బ్రాండ్ సంస్థలకు కమిట్
ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నెక్ట్స్ డైరెక్టర్ కొరటాల శివ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. అయితే పలు కారణాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం వాయిదా పడుకుంటూ వస్తుంది. దీంతో ఒక యాడ్ షూట్ చేయాలని తారక్ కమిట్ అయ్యాడు. ఇందులో ఒకటి ఈ కామర్స్ ప్లాట్ ఫారం అయిన లైషియస్ ఉంది. ఇందులో రాహుల్ రామకృష్ణతో కలిసి కోర్టులో చిత్రించిన ఒక సీన్ అభిమానులను ఆకట్టుకుంది. స్టైలిష్ లుక్ లో యంగ్ స్టార్ ఎన్టీఆర్ మెరిసిపోతూ కనిపించడంలో ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. తర్వాతి మూవీ లేటవుతుండడంతో తమ అభిమాన హీరోను ఇలాగైనా చూసుకోవచ్చని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 3.50 కోట్లు
ఈ యాడ్ షూట్ కు యంగ్ టైగర్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. లైషియస్ బ్రాండ్ కంపెనీ కావడంతో రెమ్యునరేషన్ విషయంలోనూ తారక్ తగ్గలేదట. ఈ యాడ్ కోసం ఆయన ఏకంగా రూ. 3.50 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. దీనిపై అటు కంపెనీ కానీ, ఇటు తారక్ కానీ ఏవిధమైన కామెంట్ చేయలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులకు కమిట్ అయ్యారట. ఒకటి దర్శకుడు కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్-30 అయితే మరో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి ఎన్టీఆర్-31 ఉన్నాయి.
రీసెంట్ గా కొరటాల
ఈ రెండు చిత్రాలకు సంబంధించి విడుదలైన టీజర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా. మూవీ షూటింగ్ ఎప్పుడంటూ ఆయన అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రీసెంట్ గా కొరటాల తన తర్వాతి ఎన్టీఆర్ తో కలిసి తీసే చిత్రానికి సంబందించి మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా కలిశారట.