‘మంచు’ ఫ్యామిలీలో విభేదాలు.. మరోసారి బలైపోయిన ‘మనోజ్’

0
807

కొన్ని హిట్లు ఎక్కువగా ప్లాపులతో మంచు మనోజ్ వెండితెరపై రాణించలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన కుటుంబం నుంచి కూడా వేరయ్యాడన్న వార్తలు సోషల్ మీడియా వేధికగా తెగ వైరల్ అవుతున్నాయి. తను కుటుంబానికి ఎంత దగ్గర కావాలని అనుకున్నా కుటుంబ సభ్యులు ఆయనను దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మంచు ఫ్యామిలీకి ఆయన ఎందుకు దూరమయ్యాడో తెలుసుకుందాం.

ఇటీవల తీవ్రంగా మనస్పర్థలు

మంచు మహేశ్ బాబు ఫ్యామిలీ గురించి ఇండస్ర్టీకి పరిచయం అవసరం లేదు. ఆ కుటుంబంలో ఉన్న వారదందరూ నటులే ఒక్క మోహన్ బాబు వైఫ్ తప్ప. మోహన్ బాబుకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. విష్ణు, మనోజ్, లక్ష్మి. కుమారులు హీరోలుగా, కూతురు హీరోయిన్ తో పాటు నిర్మాతగా, దర్శకురాలిగా చాలా విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అయితే వీరి కుటుంబంలో ఇటీవల తీవ్రంగా మనస్పర్థలు వచ్చాయన్న విషయం తెలిసిందే.

వార్తల్లో నిలుస్తున్న మనోజ్

వీరి కుటుంబంలో చిన్న వాడైన మంచు మనోజ్ కు అప్పట్లో మంచి హిట్లు వచ్చాయి. కానీ చాలా కాలంగా ఆయన ఇండస్ర్టీకి దూరంగా ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయన వార్తల్లోకి వస్తున్నాడు. మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని, ఈ వార్తలు ఇప్పుడు మంచు ఫ్యామిలీతో పాటు ఆయన అభిమానులను కూడా కలవరపెడుతున్నాయి. రాయలసీమకు చెందిన ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి అమ్మాయితో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలస్తుంది. ఆమెతో కలిసి ఉన్న ఫొటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఒక పొలిటిక్ ఫ్యామిలీలోని అమ్మాయితో

కర్నూలుకు చెందిన భూమా నాగిరెడ్డి దంపతుల రెండో కూతురు భూమా మౌనికా రెడ్డినే మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. హైదరాబాద్ లోని గణేశ్ మండపంలో మంచు మనోజ్ తో కలిసి మౌనికా రెడ్డి చేసిన పూజలకు సంబంధించి ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో గాసిప్ లకు మరికొంత బలం చేకూర్చినట్లయింది.

ఈ పెళ్లి కారణంగానే విభేదాలా..?

మనోజ్ రెండో వివాహం కారణంగానే వారి ఫ్యామిలీలో విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మనోజ్ కుటుంబంతో కలిసి ఉండడం లేదట. అందరూ కలిసి మనోజ్ ను దూరం పెట్టారని వార్తలు వినిపిస్తు్న్నాయి. అన్నా దమ్ముల మధ్య కూడా మాటలు లేవని తెలుస్తోంది. ఆయన కుటుంబానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించినా కుటుంబ సభ్యులు మాత్రం దూరం పెడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

రెండు సంఘటనలు

మంచు మనోజ్ కుటుంబంతో కలవాలని ఎంత ప్రయత్నిస్తున్నా కలిపుకునేందుక కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మంచు విష్ణు బర్త్ డే రోజు మనోజ్ అన్నకు విషెస్ తెలుపుతూ పోస్ట్ పెట్టాడట. కానీ విష్ణు మాత్రం ఆ పోస్టును పట్టించుకోలేదని తెలుస్తోంది. కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వలేదు. గత శుక్రవారం విష్ణు కూతురులు అరియానా, వివియాన బర్త్ డే సందర్భంగా కూడా మనోజ్ ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్తూ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టుకు కూడా కనీసం ఫ్యామిలీ నుంచి ఎవరూ స్పిందించలేదు.

పాపం మనోజ్

మనోజ్ ఫ్యామిలీకి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా కుటుంబ సభ్యులు మాత్రం అతడిని దూరం పెడుతున్నారన్న వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. ఇక మనోజ్ గురించి చెప్పుకుంటే మనోజ్ కు ప్రణతితో వివాహం జరిగింది. వారి దాంపత్య బంధం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లయిన రెండు నెలలకే ఇద్దరూ విడిపోయారు. తర్వాత ప్రణతి అమెరికా వెళ్లడం అక్కడ ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడిపోవడం వెంటవెంటనే జరిగాయి. కానీ మనోజ్ మాత్రం ఇక్కడే ఉంటూ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్ గా ఫ్యామిలీకి కూడా దూరం అయ్యాడని తెలుస్తోంది.