చిరంజీవి తాత కాబోతున్నారోచ్.. మెగాస్టార్ ఇంట సందడి

0
1059

రామ్ చరణ్ ఉపాసనకు వివాహమై దాదాపు పదేళ్లు కావస్తుంది. ఇప్పటికీ మెగాస్టార్ ఇంట పండగ వాతావరణం ఏర్పడింది. రామ్ చరణ్ వివాహంతో పాటే (దాదాపు అదే ఇయర్). టాలీవుడ్ యంగ్ స్టార్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మహేశ్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, తదితరులకు వివాహాలు జరిగాయి. వారికి వారసులు కూడా వచ్చారు. కానీ ఇంత వరకూ మెగాస్టార్ ఇంట ఇలాంటి పండుగ వాతావరణం నెలకొన లేదు. దీంతో మెగా, చెర్రీ ఫ్యాన్స్ చెర్రీ వారసులు ఎప్పుడంటూ ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. వీటిని చిరంజీవి రీసెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టారు.

అపోలో హాస్పిటల్స్ అధినేత

రామ్ చరణ్ కెరీర్ ప్రారంభ సమయంలోనే వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్స్ అధినేత మనుమరాలైన ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చెర్రీ. ఉపాసన కూడా అపోలో హాస్పిటల్స్ కు సంబంధించి కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. అప్పుడప్పుడే ఇద్దరి కెరీర్ ప్రారంభం కావడంతో పిల్లలు ఉంటే వారిని చూసుకునేందుకు ఇబ్బందిగా ఉంటుందని అనుకొని కొన్నాల్లు ఆగుదాం అనుకుంది మెగా జంట. అయితే ఇటీవల రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ హిట్టవడం, వరసగా భారీ ప్రాజెక్టులు వస్తుండడంతో రామ్ చరణ్ కెరీర్ దూసుకుపోతోంది.

ఉపాసన ప్రెగ్నెంట్

కెరీర్ దూసుకుపోతున్నా.. వారసుడు తప్పదంటూ.. ఇటు తల్లిదండ్రులు, అటు అత్తమామలు ఈ జెంటను ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో వారు కూడా సమ్మతించారట. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ జపాన్ లో విడుదలైన సమయంలో చెర్రీ జంట జపాన్ లో టూర్ కూడా వేశారు. దీంతో పాటు విరివిగా వెకేషన్స్ కు వెళ్లడంతో వారి కోరిక కూడా ఫలించిందట. ఇప్పుడు ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతో మెగా ఇంట ఆనందం నెలకొంది.

పదేళ్లు గడిచిపోయాయి

2012లో చెర్రీకి-ఉపాసనకు వివాహం జరిగింది. ఇప్పటికి దాదాపు పదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఈ జంట శుభవార్త తెలపడంతో మెగా ఇంట బోసినవ్వుల సందడి ఇంకొన్ని రోజుల్లో వినపడనుంది. దీంతో మెగా ఫ్యాన్స్, చెర్రీ ఫ్యాన్స్ విశెష్ తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చిరంజీవి ట్వీట్ కు ఇండస్ర్టీలో కూడా ఆనందం నెలకొందని కొందరు ప్రముఖుుల రీ ట్వీట్ పెడుతున్నారు.