రష్యాలో మన టాలీవుడ్ మూవీ.. ఐకాన్ స్టార్ కు పెరగనున్న క్రేజ్

0
247

టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. బాహుబలి నుంచి మొదలైన ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా ‘త్రిపుల్ ఆర్’ మూవీని జపాన్ లాంగ్వేజ్ లో డంప్ చేసి అక్కడ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రజనీకాంత్ మూవీ ముత్తును రికార్డులను ఇది తిరగరాయనుంది. ఇప్పుడు అలాంటి ఘనత మరో మూవీకి దక్కనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన రీసెంట్ చిత్రం ‘పుష్ప: ది రైజ్’ గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ హిట్ దక్కించుకుంది. రూ. 360 కోట్లుకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది.

రష్యాలో రిలీజ్

తాజాగా టాలీవుడ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీని రష్యన్ లాంగ్వేజ్ లో డబ్ చేసి రష్యాలో రిలీజ్ చేయబోతున్నారట. వచ్చే నెల అక్కడి ఆ దేశ ప్రేక్షకులను ఈ మూవీ అలరించనుంది. డిసెంబర్ 8వ తేదీన రష్యా దేశ వ్యాప్తంగా థియేటర్స్ లో ‘పుష్ప’ రిలీజ్ చేయనుంంది. ఈ మూవీ ప్రమోషన్ కోసం ఇటీవల చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతుందట. డిసెంబర్ 1న మాస్కో, 3న సేయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ కు వెల్ కం చెప్పేందుకు అక్కడి అభిమానులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికీ ట్రెండింగ్ లో మూవీ

చిత్రంలోని పుష్ప మేనరిజం, పాటలు, మాటలు ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి. పొలిటీషన్స్ నుంచి క్రికెటర్స్ వరకూ ఏదో ఒక సందర్భంలో పుష్పరాజ్ ను అనుకరిస్తూనే ఉన్నారు. రష్యాలో క్రేజ్ తర్వాత మరింత క్రేజ్ ను సంపాదించుకోనుంది ఈ మూవీ. రాజమౌళి ‘త్రిపుల్ ఆర్’ జపాన్ లో తన సత్తా చాటుతుండగా, సుకుమార్ ‘పుష్ప’ రష్యాలో ఏ మేరకు దూసుకుపోతుందో చూడాలి మరి.

మరింత గ్రాండ్ గా సీక్వెల్

దర్శకుడు సుకుమార్ ‘పుష్పం: ది రైజ్’కు సీక్వెల్ తీస్తున్నాడు. దీని పేరు ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అక్టోబర్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో పుష్ప2 చిత్రీకరణ ప్రారంభమైనట్లు సమాచారం. దీనిని మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారట సుకుమార్. పార్ట్ 2 కు రూ. 350 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఈ మూవీకి మరిన్ని పాత్రలు యాడ్ చేస్తూ ప్రేక్షకులను కట్టి పడేసేలా సీక్వెల్ ఉండబోతోందని తెలుస్తుంది. సుకుమారా మజాకా.. ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కదబ్బా.. అంటూ తెలుస్తోంది.