పుష్ప లో ఛాన్స్ రిజెక్ట్ చేసిన యంగ్ హీరోయిన్.. ఇప్పుడు అడుక్కునే పరిస్థితిలో!

0
721

కొంత మంది స్టార్లు తమకు గుర్తింపు తగ్గుతుందనుకొని కొన్ని అవకాశాలను వదులుకుంటారు. తర్వాత ఆ సినిమా హిట్ అయితే తల పట్టుకుంటున్నారు. ఇది షరా మామూలే. ఇక ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధిస్తే ఇంకేముంది ఏడుపుఒక్కటే తక్కువ. ఇలాంటి ఘటనే ఒకటి సినీ ఇండస్ర్టీలో రీసెంట్ గా వెలుగు చూసింది. పాన్ ఇండియా యంగ్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ తెలియని సినీ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. సుకుమార్ దర్శకత్వంలో వెండితెరకు ఎక్కిన ఈ మూవీ పాన్ ఇండియాను దాటి ఇప్పుడు విదేశాలకు చేరుకుంది.

పాన్ ఇండియా స్టార్ తో చేసే ఛాన్స్ మిస్

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే గంగోత్రితో ఎంట్రీ ఇచ్చిన అల్లు వారి పిల్లగాడి విజయ పరంపరా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో విజయాలను సాధిస్తూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాడు. అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు దాదాపు రూ. 100 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటే ఆయన స్థాయి ఏ లెవల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ హీరోగా 17 డిసెంబర్, 2021లో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. మొదలు ఇది స్థానిక భాషలో విడుదల చేసినా బాగా క్రేజ్ సొంతం చేసుకోవడంతో అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు.

పుష్ప 2 లో కూడా లేనట్టే

దీంతో పాన్ ఇండియాల లెవల్లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. పుష్ప తీసిన సమయంలోనే దీనికి సీక్వెల్ కూడా తీస్తున్నట్లు దర్శకుడు సుకుమార్ ప్రకటించారు. పుష్ప రికార్డులను తిరిగి రాయడంతో ‘పుష్ప2’ కూడా అనేక అంచనాలతో వస్తుందని సినీ ఇండస్ర్టీ భావిస్తోంది. దీని షూటింగ్ ఇటీవలే ప్రారంభం కాగా వేగంగా జరుగుతోందని, ఎక్కువ రోజులు ఎదురుచూపులు లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకస్తామని చిత్ర యూనిట్ చెప్తుంది. ఇందులో హీరోయిన్ గా రష్మికా మందన నటించింది. కన్నడ ఇండస్ర్టీ నుంచి టాలీవుడ్ కు వచ్చింది రష్మిక.

రష్మికకు యమా క్రేజ్

తెలుగు తెరపై అనేక విజయాలను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప లో హీరోయిన్ గా నటించి ఆమె కూడా పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చకున్నారు. దీంతో పాటు పలు యాడ్స్ లో కూడా పాల్గొంటూ ఆర్థికంగా కూడా బాగా సంపాదిస్తున్నారు రష్మిక. పుష్ప స్ర్కిప్ట్ పూర్తయిన తర్వాత ఇందులో కొత్త హీరోయిన్ అయితే బాగుంటుంది అనుకున్నారు దర్శకుడు సుకుమార్. అయితే ఆయనకు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాగుంటుంది అనుకున్నాడు. కథను ఆమె తండ్రి బోనీ కపూర్ కు వివరించారు సుకుమార్.

బోనీ కపూర్ ఒప్పుకోలేకనే

కథ పరంగా ఇందులో హీరోయిన్ పాత్ర డీ గ్లామర్ గా ఉంటుంది. తన బిడ్డకు ఇలాంటి డీ గ్లామర్ పాత్ర వద్దని, ఈ లుక్ లో ఆమె కనిపిస్తే ఇమేజ్ పోతోందని భావించారట. అందుకే బోనీ కపూర్ సుకుమార్ పుష్ప ప్రాజెక్టుకు నో చెప్పాడు. తర్వాత సుకుమార్ రష్మికకు కథ చెప్పడం ఆమె ఒప్పుకోవడం అంతా అయిపోయింది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ రికార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత రష్మిక నటన గురించి చెప్పుకోవాలంటే పుష్పాకు ముందు, తర్వాత అని చెప్పుకోవాల్సిందే. ఈ మూవీతో ఆమె స్థాయి ఎక్కడికో వెళ్లింది.

అవకాశాల కోసం అడుక్కుంటున్న స్థాయికి

ఇంత మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అంటూ బోనీ కపూర్, జాన్వీ కపూర్ ఇప్పుడు తలపట్టుకుంటున్నారట. జాన్వీ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే అవకాశాల కోసం డైరెక్టర్లను అడుక్కునే పరిస్థితికి వచ్చింది. దీనికి అంతటికి బోనీ కపూరే అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంకా పాతకాలంలోనే కాకకుండా అప్ డేట్ అవ్వాలని సూచనలు కూడా చేస్తున్నారు. సుకుమార్ లాంటి డైరెక్టర్ సెలక్ట్ చేస్తే రిజక్ట్ చేస్తారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు.