తొలిప్రేమ లాంటి హిట్ ఉన్నా.. కీర్తిరెడ్డి కెరీర్ ఎందుకు ముగిసింది..?

0
581

పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తిరెడ్డికి ఫస్ట్ మూవీ తొలిప్రేమ. ఇది సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. పవన్ కళ్యాణ్ కెరీలోనే ఇది బిగ్ హిట్ అయితే కారుణాకర్ ఈ మూవీతో ఫస్ట్ డైరెక్టర్ గా ఇండస్ర్టీలోకి అడుగు పెట్టాడు. ఇక హీరోయిన్ గా చేసిన కీర్తిరెడ్డికి ఇది తొలిచిత్రం. ఇది బాక్సాఫీస్ హిట్లను తిరగరాస్తూ టాలీవుడ్ ఇండస్ర్టీలో రికార్డులను క్రియేట్ చేసింది. దాదాపు ఏడాదికి పైగా ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేసింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ప్రేమ, డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీకి అప్పట్లో సపరేట్ మూవీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పడ్డాయంటే అతిశయోక్తి కాదు.

తొలిప్రేమతో ఎంట్రీ

సాధారణ ప్రేమకథే అయినా దాన్ని తెరకెక్కించడంలో కరుణాకరణ్ విజయం సాధించాడనే చెప్పాలి. హీరోయిన్ ఇంట్రడక్షన్ ఈ మూవీకి హైలెట్. ఈ సీన్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటుంది. ఇక ఇందులో పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిందనే చెప్పాలి. ఆర్ట్ డైరెక్ట్ ఆనంద్ సాయి ఒక పాటకు వేసిన తాజ్ మహల్ సెట్ హైలట్ గా నిలిచింది. ఈ సినిమా ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమేు కాకుండా ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ ఇచ్చిందంటే అతిశయోక్తి కాదేమో. తర్వాత డైరెక్టర్ కరుణాకరన్ ను వెతుక్కుంటూ ప్రొడ్యూసర్లు క్యూ కట్టారంటే ఈ సినిమాతో ఆయన ఏ మేరకు మాయాజాలం సృష్టించాడో అర్థమవుతుంది.

కమర్షియల్ ను పట్టించుకోని కీర్తిరెడ్డి

హీరోయిన్ గా ఈ సినిమాతోనే కీర్తిరెడ్డి ఎంట్రీ ఇచ్చినా అంతకు ముందున్న హీరోయిన్లకు లేని ఫ్యాన్ ఆ సందర్భంలో ఆమెకు ఏర్పడ్డారు. ఇందులో ఆమె మాట్లాడే తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టకుంది. ఈ చిత్రంలో ఆమె ఫర్మార్మెన్స్ వేరే లెవలనే చెప్పాలి. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ను కీర్తిరెడ్డి కమర్షియల్ గా మార్చుకోలేదు. మరో హీరోయిన్ అయితే కమర్షియల్ గా మార్చుకొని రెమ్యునరేషన్ విపరీతంగా పెంచేది. కీర్తి రెడ్డి మాత్రం అందుకు పాకులాడకుండా మంచి గ్లామర్, ప్రాధాన్యత ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకుంది.

సుమంత్ తో పెళ్లి

తొలిప్రేమతో కీర్తిరెడ్డికి అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ ఆమె కెరీర్ మాత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది. కీర్తిరెడ్డి కొన్ని సినిమాలు మాత్రమే తీసి హీరో సుమంత్ ను వివాహం చేసుకుంది. ఈ పెళ్లి కూడా ఆమె కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోయేందుకు కారణం కావచ్చని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. పెళ్లి అయిన తర్వాత ఏడాదికే డైవర్స్ కూడా అయ్యింది. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. ఇంత తొందరగా పెళ్లి చేసుకొని ఉండకపోతే ఆమె కెరీర్ బాగానే ఉండేదని కొందరు సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ కూడా వెనకే

సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కీర్తిరెడ్డికి అవకాశాలు కూడా తక్కువగానే వచ్చాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఒక సినిమాలో సోదరి పాత్రలో నటించింది. ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసినా తర్వాత అవకాశాలు మాత్రం వరించలేదు. తొలిప్రేమ క్రేజ్ ను కమర్షియల్ గా ఉపయోగించుకుంటే కెరీర్ లో ముందుకు సాగడంతో పాటు ఆర్థికంగా కూడా ఫిట్ గా ఉండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుమంత్ డైవర్స్ తర్వాత ఒక ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకున్న కీర్తిరెడ్డి అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ అయ్యింది.