రజనీకాంత్‌ ప్లేస్‌లోకి లారెన్స్‌ ఎంట్రీ..

0
445

సినిమాలందు క్రేజీ సినిమాలు వేరయా అని.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సూపర్‌డూపర్‌ సాధించిన చిత్రాలకు సీక్వెల్‌లు రావాలని ప్రేక్షకులు ఎప్పుడూ ఉత్కంఠగానే ఎదురు చూస్తుంటారు. అలాంటి క్రేజీ చిత్రాల్లో ‘చంద్రముఖి’ ఒకటి. జ్యోతిక ప్రధాన పాత్రలో రజనీకాంత్‌, ప్రభులు నటించిన హర్రర్‌ మూవీ ‘చంద్రముఖి’. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించింది. తమిళనాడులో ఏకంగా 2సంవత్సరాలు ప్రదర్శింపబడిరది. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో హర్రర్‌ మూవీస్‌ కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయంటే నమ్మి తీరాల్సిందే. కానీ ఏవీ చంద్రముఖిని రేంజ్‌ను తాకలేకపోయాయి.

చంద్రముఖి తర్వాత ప్రేక్షకులకు ఆరిపించి ఆకట్టుకున్నది కేవలం లారెన్స్‌ కాంచన సీరీస్‌. చంద్రముఖి విడుదల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌ అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోంది అని గాలి వార్తలు షికారు చేశాయి తప్ప కార్యరూపం మాత్రం దాల్చలేదు. 17 సంవత్సరాల తర్వాత ‘చంద్రముఖి’ సీక్వెల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వచ్చింది. భారీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన తమిళ చిత్ర నిర్మాణ లైకా ప్రొడక్షన్స్‌ ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నట్లు ఈరోజు తెలిపింది. తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన పి. వాసు ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే రజనీకాంత్‌కు బదులుగా రాఘవ లారెన్స్‌ మెయిన్‌ రోల్‌ చేస్తున్నాడు.

హీరోయిన్‌లు, ఇతర పాత్రలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. వడివేలు కీలక పాత్ర చేస్తున్నాడట. అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీతం మన ఎం.ఎం. కీరవాణి. చంద్రముఖి పాత్రను పోషించేది ఎవరో మాత్రం ఇంకా రివీల్‌ చేయలేదు. నిజానికి చంద్రముఖి తమిళ వెర్షన్‌ విడుదలకు దాదాపు 10 సంవత్సరాల క్రితమే విష్ణువర్ధన్‌ హీరోగా సౌందర్య చంద్రముఖిగా వచ్చిన సినిమా సూపర్‌హిట్‌ సాధించింది. ఆ తర్వాత పదేళ్లకు తమిళంలో రజనీకాంత్‌, జ్యోతికల కాంబినేషన్‌లో తెరకెక్కింది. ఈ సీక్వెల్‌ చంద్రముఖి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.