చిరు, బాలయ్యకు ‘9’ సెంటిమెంట్.. పై చేయి ఎవరిదో తెలుసా..?

0
549

మెగాస్టార్ చిరంజీవి, నటరత్న బాలకృష్ణ మధ్య పోటీ అంటే బాక్సాఫీస్ కూడా షేక్ కావాల్సిందే.. వీరిద్దరూ ఇప్పటి వరకూ దాదాపు 30 సార్లు పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందులో ఎనిమిది సార్లు సంక్రాంతి వేదికగా పోటీ పడ్డారు. ఇందులో వీరు చివరి సారిగా 2017లో పోటీని ఎదుర్కొన్నారు. ఆ సంవత్సరం వీరిద్దరి చిత్రాలు కూడా బాక్సాఫీస్ హిట్లుగా నిలిచాయి.

మొదటి సారి తలపడింది 2017లో

ఇక చిరంజీవి విషయానికి వస్తే. 2017కు ముందు చిరు రాజకీయాల్లోకి వెళ్లడం, ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికలను ఎదుర్కొనడం. తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిలో కొనసాగడం. తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పడం. ఈ తంతంగంతో ఆయన పదేళ్లు ఇండస్ర్టీకి దూరంగా ఉన్నారు. 2017లో ఆయన ఎంట్రీతో వచ్చిన చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ ఇది చిరంజీవికి కూడా 150వ చిత్రం. ఈ సంవత్సరమే బాలయ్య బాబు గౌతమిపుత్ర శాతకర్ణి కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయమే సొంతం చేసుకున్నాయి. ఇందులో చిరంజీవి ఖైదీ ఎక్కువగా కలెక్షన్లను కురిపించగా, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి ప్రశంసలు అందుకుంది.

ఇద్దరి మధ్యా ‘9’ సెంటిమెంట్

ఇద్దరి మధ్యా నెంబర్ 9 కీలకంగా మారుతుంది. ఈ విశేషాలను తెలుసుకుందాం. బాలకృష్ణ, చిరంజీవి మొదటి సారి 1984, సెప్టెంబర్ లో బాక్సాఫీస్ వద్ద పోటీని ఎదుర్కొన్నారు. ఆ సమయంలో బాలయ్య బాబుది ‘మంగమ్మ గారి మనుమడు’ 7వ తేదీన, చిరంజీవి ‘ఇంటిగుట్టు’ 14వ తేదీన రిలీజ్ అయ్యాయి. అప్పటి పోటీలో బాలయ్యే విజయం సాధించారు. ఇక్కడ సెప్టెంబర్ 9వ నెల. తర్వాత 1987లో చిరంజీవి సినిమా ‘దొంగ మొగుడు’, బాలయ్య సినిమా ‘భార్గవ రాముడు’. ఈ రెండు సినిమాలు పోటీలో నిలవగా చిరంజీవి ‘దొంగ మొగుడు’ విజయం సాధించింది.

చిరంజీవి సినిమాదే పైచేయి

ఇక్కడ దొంగ మొగుడు 9 జనవరి, 1987లో రిలీజ్ అయ్యింది. ఇక సంఖ్యా కూడికలో పరిశీలిస్తే 1998 (1+9+9+8=27, 2+7=9)లో చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తే.. బాలకృష్ణ ‘యువరత్న రాణా’ ఏప్రిల్ 17న రిలీజైంది. ఇక్కడ చిరంజీవి సినిమాదే పైచేయి అయ్యింది. కానీ ప్రశంసలు దక్కించుకుంది మాత్రం బాలయ్య బాబు చిత్రం. తేదీ, నెల, సంవత్సరం ఇలా అన్నింట్లో 9 కీ రోల్ గా నిలుస్తుంది.

ఈ సారి ‘9’వ సారి

ఇక 1999 (ఇందులో రెండు 9లు ‘99’) జనవరి 1వ తేదీన చిరంజీవి ‘స్నేహంకోసం’, అదే నెల 13న బాలయ్య ‘సమరసింహా రెడ్డి’ విడుదలయ్యాయి. ఇందులో బాలయ్య పైచేయి సాధించారు. సమరసింహా రెడ్డితో బాలయ్య హిట్ కొట్టగా, స్నేహం కోసం ప్రశంసలు దక్కించుకుంది. ఇలా ‘9’తో ఇద్దరు స్టార్లు ఎనిమిది చాలా సార్లు తలబడ్డారు. ఒక సారి ఒకరికి, మరోసారి ఇంకొకరికి విజయం దక్కాయి. ఇక వచ్చే సంవత్సరం (2023)లో సంక్రాంతి సందర్భంగా ‘9’వ సారి బరిలో నిలుస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో చిరంజీవి మూవీ ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’తో వస్తున్నారు. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారో సంక్రాంతి వరకు వేచి చూడాలి మరి.