ఓటీటీ రైట్స్‌లో సలార్‌ ఊచకోత

0
454
salaar ott rights price

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రేక్షకులు ఎదురు చూసిన మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ‘సలార్‌’ నిన్న విడుదలై కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌, పాన్‌ ఇండియా డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, పాన్‌ ఇండియా ప్రొడక్షన్‌ హౌస్‌ హోంబలేల కాంబినేషన్‌లో రూపొందిన ఈ అత్యంత భారీ బడ్జెట్‌ మూవీ ప్రారంభం నుంచీ టాక్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమాగా నిలుస్తూనే ఉంది.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్‌’ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు సూపర్‌కిక్‌ ఇచ్చే మూవీగా నిలిచింది. ప్రభాస్‌ కటౌట్‌ను ఏ విధంగా వాడుకోవాలో ప్రశాంత్‌ నీల్‌కు బాగా అర్ధమైనట్లు ఉంది. అందుకే ప్రతి సినిమాలో స్టార్‌ హీరోకు ఒకటే ఎంట్రీ ఎలివేషన్‌ సీన్‌ ఉంటే.. ఈ సినిమాలో మాత్రం ప్రశాంత్‌నీల్‌ ప్రభాస్‌కు అలాంటివి 4, 5 పెట్టాడు.

salaar ott rights price

మిరాజ్‌, పీవీఆర్‌లతో ‘సలార్‌’ పంచాయితీ

దీంతో సినిమా మొత్తం ఈలలు, చప్పట్లతో థియేటర్లు మారుమోగిపోతున్నాయి. ప్రారంభం నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో థియేటర్‌ హక్కులతో పాటు డిజిటల్‌ హక్కులకు కూడా తీవ్రమైన పోటీ ఏర్పడిరది.

కానీ నిర్మాణ సంస్థ హోంబలేకు ఈ సినిమా విజయంపై సంపూర్ణమైన నమ్మకం ఉండటంతో ముందుగా హక్కులను అమ్మలేదు. సినిమా విడుదలకు దగ్గర పడిన తర్వాతే వివిధ భాషల్లో థియేట్రికల్‌ హక్కులను కళ్లు చెదిరే రేట్లకు అమ్మారు.

డిజిటల్‌ హక్కులను మాత్రం అమ్మకుండా తమవద్దే ఉంచుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం థియేట్రికల్‌ కలెక్షన్లతో పాటు డిజిటల్‌ రైట్స్‌ విషయంలో కూడా సలార్‌ ఊచకోత కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ హక్కుల కోసం దేశంలోనే టాప్‌ 5 ఓటీటీ సంస్థలు పోటీ పడగా నెట్‌ఫ్లిక్స్‌ 160 కోట్ల వరకూ ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్‌ ఇప్పుడు సినీ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. 160 కోట్లు అంటే ఓ భారీ హిందీ సినిమాను తెరకెక్కించవచ్చు. ఈ రకంగా చూస్తే సలార్‌ సత్తా ఏమిటో మనం ఊహించుకోవచ్చు.