డైరెక్టర్ శంకర్ తో న్యూజిలాండ్ బయల్దేరిన రామ్ చరణ్

0
417

త్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ రెట్టింపయ్యింది. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు చిరు తనయుడు. రామ్ చరణ్ తో తన నెక్ట్స్ సినిమా తీసేందుకు శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సిద్ధమయ్యాడు. ఈ మూవీకి ఆయన పెట్టుకున్న పేరు ‘RC15’ ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. దీనిని భారతీయుడు-2 కంటే ముందే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ పిక్స్ వైరల్ గా

ఇంకా ఈ మూవీకి ఇంకా పేరు డిక్లేర్ చేయలేదు. ఇందులోని సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ శనివారం (నవంబర్ 19) రాత్రి న్యూజిలాండ్ బయల్దేరింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కుతుండగా రామ్ చరణ్ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తన ఆఫ్ డ్యూటీ లుక్ తో మంచి క్యాప్ తో బ్లాక్ ట్రాక్ సూట్ తో ఆయన ఫ్లైట్ ఎక్కుతూ కనిపించాడు.

ప్రత్యేక పాత్రలో ఎస్‌జే సూర్యా కూడా

శ్రీ వేంకటేశ్వర్ క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ కలిసి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ సరసర బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వానీని కథానాయికగా ఎంపిక చేశారు. ప్రత్యేక పాత్రలో ఎస్‌జే సూర్యా కూడా కనిపించబోతున్నారంట. అంజలి, జయరాం, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, తదితరులు నటించనున్నారు. స్టోరీని మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించారు. ఎస్ థమస్ మ్యూజిక్ డైరెక్టర్ గా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇందులో ఒక పాట చిత్రీకరణకు అత్యధిక బడ్జెట్ కేటాయించినట్లు చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.