బిగ్ బాస్ విన్నర్ ముందే ఫిక్సా.. రేవంత్ విన్నింగ్ పై సర్వత్రా చర్చ

0
1443

ఊహించని మలుపులు, తీవ్ర ఉత్కంఠతో కొనసాగే గేములతో బిగ్ బాస్ సీజన్ 6 ఎట్టకేటకు ఆదివారం (డిసెంబర్ 18) పూర్తియింది. ఇందులో 21 మంది కంటెస్టెంట్లు పాల్గొని అద్భుత పర్ఫార్మెన్స్ కనబర్చారు. మొదటి ఐదు సిజన్లలో బాగా ఆకట్టకున్న బిగ్ బాస్ ఆరో సీజన్ మాత్రం అంత ఆతృతగా కనబర్చలేకపోయింది. ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులు కూడా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోలేక గందరగోళానికి గురయ్యారు. ఎలిమినేషన్ వారం ప్రేక్షకుల ఓటింగ్ కు భిన్నంగా ఫలితాలు వస్తుండడంతో కొంత అసహనాని గురయ్యారనే చెప్పాలి.

కొన్ని వారాలకే ఫిక్స్ అయిన ప్రేక్షకులు

ఏ కంటెస్టెంట్ ఏ సమయంలో బయటకు వస్తున్నాడో వీక్షకులకు అంతు పట్టకుండా సీజన్ 6 కంప్లీట్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమైన కొన్ని వారాలకే రేవంత్ విన్నర్ అవుతాడని ప్రేక్షకులు మొదట ఫిక్స్ అయ్యారు. కానీ శ్రీహాన్, ఇనయా గట్టి పోటీ ఇవ్వడంతో కాస్త వెనుకబడ్డాడు. మళ్లీ పుంజుకున్నాడు. చివరికి రేవంత్ రెడ్డే టైటిల్ ను దక్కించుకున్నారు. ఉత్కంఠతగా సాగిన సీజన్ 6లో చివరికి ఇద్దు మాత్రమే మిగిలారు.

చివరి ఎపీసోడ్ కు సూట్ కేస్ తో వచ్చిన నాగార్జున ఇద్దరికీ ఒక ఆఫర్ ఇచ్చారు. రూ. 25 లక్షలు ఒకరు తీసుకుంటే మరొకరు విన్నర్ గా నిలుస్తారని ప్రకటించారు. 25 లక్షలు పోనూ మిగిలిన డబ్బుతో విన్నర్ టైటిల్ ను గెలువచ్చని చెప్పారు. అయితే ఇందుకు శ్రీహాన్, రేవంత్ రెడ్డి ఎవరూ కూడా ముందుకు రాలేదు.

నాగార్జున బంపర్ ఆఫర్

బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్ట్ చేసిన వారందరితో నాగార్జున ఓటింగ్ నిర్వహించారు. ఇందులో 10 ఓట్లు శ్రీహాన్ కు పడగా, 9 ఓట్లను రేవంత్ రెడ్డికి వేశారు. దీంతో ట్రోఫీ కోసం శ్రీహాన్ కు దక్కుతుందని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున ఆఫర్ ను పెంచాడు. రూ. 30 లక్షలు ఇస్తాను ఒకరు స్వచ్ఛందంగా తప్పుకోవచ్చు అని సూచించారు. అయినా ఇద్దరు టెంప్ట్ అవ్వలేదు. తర్వాత రూ. 40 లక్షలకు పెంచడంతో శ్రీహాన్ తండ్రి సూచనల మేరకు ఆ డబ్బు తీసుకునేందుకు ఒప్పుకున్నాడు.

రూ. 40 లక్షలతో తప్పుకున్న శ్రీహాన్

శ్రీహాన్ రూ. 40 లక్షలు తీసుకోగా రేవంత్ విన్నర్ గా నిలిచారు. ఈ చివరి ఎపీసోడ్ చాలా వైవిద్యంగా సాగింది. నాగార్జున ఆఫర్లు ఇవ్వడం, మాజీ కంటెస్టెంట్లు ఓటింగ్ లో పాల్గొనడం, చివరికి శ్రీహాన్ బయటకు రావడం, రేవంత్ టైటిల్ గెలుచుకోవడం. టైటిల్ ఇస్తున్న క్రమంలో రేవంత్ పర్ఫార్మెన్స్ వీడియో ఒకటి ప్లే చేశారు బిగ్ బాస్. తన విన్నర్ టైటిల్ తన కూతురికి గిఫ్ట్ ఇస్తానని చెప్పిన రేవంత్ కల నెరవేర్చుకున్నాడు. ఆయన తల్లి సుబ్బలక్ష్మి, భార్య అందరూ హ్యాపీగా ఫీలయ్యారు.

ఆమెకు మద్దతుగా అనేక ట్వీట్లు

అయితే సీజన్ విన్నింగ్ పై కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా కొంత గందరగోళానాకి గురయ్యారు. రేవంత్ అన్ని విభాగాల్లో గట్టి పోటీ ఇచ్చినా ఎపీసోడ్, ఎపీసోడ్ కు ఫలితాలు మారుతూనే ఉన్నాయి. ఒక దశలో ఇనయా విన్నర్ అవుతుందనుకున్న ఆడియన్స్ ఆమె ఎలిమినేట్ అవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమెకు మద్దతుగా అనేక ట్వీట్లు హల్ చల్ చేశాయి. ఇక శ్రీహాన్ గెలుస్తాడనుకుంటే తండ్రి మాటతో డబ్బులతో పోటీ నుంచి తప్పుకున్నాడు. రేవంత్ రెడ్డి ముందే ఫిక్స్ అయ్యాడా అని సర్వత్రా చర్చ కూడా నడుస్తోంది.