‘పుష్ప’ పార్ట్‌ 2 డౌటేనట

0
1390

ఇటీవల కాలంలో ప్రేక్షకుల నుంచి మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీగా ‘పుష్ప’ పేరు తెచ్చుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ‘అఖండ’ కన్నా కూడా ‘పుష్ప’ సినిమానే టాక్‌ ఫ్‌ ఇండస్ట్రీ అయింది. నార్మల్‌ అంచనాలతో వచ్చిన ‘అఖండ’ తొలి షో నుంచే నిజంగానే ‘అఖండ’ టాక్‌ను సొంతం చేసుకుని సంచలన విజయం సాధించింది. ఇక ‘పుష్ప’ విషయానికి వస్తే తొలి ఆట నుంచే మిక్స్‌డ్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. సుకుమార్‌ వంటి క్రియేటివ్‌ థాట్స్‌ కలిగిన దర్శకుడు, మైత్రీ మూవీస్‌ వంటి భారీ చిత్రాల నిర్మాణ సంస్థ, అల్లు అర్జున్‌, రష్మిక వంటి స్టార్స్‌, దేవిశ్రీ ప్రసాద్‌ వంటి సంగీత సంచలనం ఇలా చాలా అంశాలు పుష్పపై ఆది నుంచి క్రేజ్‌ను పెంచేశాయి. కానీ ఆశించినంతగా పుష్ప ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.

అనవసరంగా కొత్త సీన్లు

ప్రారంభంలో ఒక పార్ట్‌గా మొదలైనప్పటికీ.. కథా విస్తరణ ఎక్కువైపోవటంతో పుష్పను 2 పార్టులుగా తీయాలని దర్శక, నిర్మాతలు ఫిక్స్‌ అయిపోయారు. తొలి భాగం 3 గంటల నిడివితో విడుదల చేశారు. రెండవ భాగం కోసం అన్నట్లు అనవసరంగా కొన్ని సీన్లను జొప్పించారు. అసలు ఇదే మూడు గంటల్లో సినిమా మొత్తాన్ని ముగించేయవచ్చు. ఆల్రెడీ కథను గమనిస్తే జరిగింది ఇదే. కానీ రెండు భాగాలు అన్న కాన్సెప్ట్‌కు ఫిక్స్‌ అయిపోవటంతో ఖచ్చితంగా రెండో పార్ట్‌ చేయాల్సిన పరిస్థితులను యూనిట్‌ కల్పించుకుంది.

ఇంతటి తో ముగించేస్తేనే బెటర్‌

ఇప్పుడు తొలి భాగం ఆశించిన విజయం అందుకోక పోవటం, అలాగే రెండవ భాగంపై ఆసక్తిని పెంచేలా క్లైమాక్స్‌ థ్రెడ్‌ లేకపోవడంతో దర్శక నిర్మాతలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. రెండవ భాగానికి సంబంధించిన కొద్దిగా మాత్రమే చిత్రీకరణ జరిగింది. కాబట్టి పార్ట్‌ 2 క్యాన్సిల్‌ చేస్తే పెద్దగా నష్టం ఉండక పోవచ్చు. ఎలాగూ పార్ట్‌ 2 మీద ఎవరికీ అంచనాలు కూడా లేవు. పార్ట్‌ 1 యావరేజ్‌ టాక్‌లో నడుస్తోంది కాబట్టి బయ్యర్లు పార్ట్‌ 2 కోసం ఎగబడే అవకాశాలు ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విషయాన్ని ఇంతటి తో ముగించేస్తేనే బెటర్‌ అనేది నిర్మాతల ఆలోచన అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.