ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

0
805

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయని తెలిసిందే. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అభిమానులకు సరికొత్త సినిమాటిక్ ఫీల్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతే కాక.. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలను సైతం సిద్ధం చేయిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో దర్శక నిర్మాతలు బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

డిసెంబర్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్

ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ మంచి రెస్పాన్స్ రావడంతో పాటు.. తాజాగా వచ్చిన సంచారి సాంగ్ టీజర్ కూడా అదిరిపోయింది. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ టీజర్ వైరల్ అవుతుంది. ఇకపోతే.. ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ బయటికి వచ్చింది. డిసెంబర్ 23న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అభిమానులే అతిథులుగా ఈ పాన్ ఇండియన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వేడుక జరుగనుంది. అక్కడికి రాబోయే అభిమానులు, అతిథులు కోవిడ్ నిబంధనలకు కట్టుబడి రావాలి అంటూ చిత్ర యూనిట్ ప్రకటించారు. అంతే కాకుండా అదే రోజు 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయనుండం అభిమానులకు మరో గుడ్ న్యూస్. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు రామోజీ ఫిల్మ్ సిటీకి రానున్నారు. వాళ్ళ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల కానుంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ హీరో.. తన సినిమా ట్రైలర్ అభిమానులతో విడుదల చేయించడం అభినందించ దగ్గ విషయం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. రాధే శ్యామ్ చిత్రం జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.