ఆ హీరోయిన్ పై వెంకటేశ్ కు ఎందుకంత కోపం..?

0
260

విక్టరీ వెంకటేశ్ దేశ వ్యాప్తంగానే పెద్దగా పరిచయం అవసరం లేదని పేరు. ఈ పేరే చాలా సినిమాలను బాక్సాఫీస్ వద్ద హిట్లను కట్టబెట్టింది. ఎంతో మంది దర్శకులను పరిచయం చేసింది. ఎంతో మంది నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది. వెంకటేశ్ అంటేనే సెట్ లో సందడి ఉంటుంది. సినిమాల్లో లాగా ఆయన సెట్ లో కొంచెం సీరియస్ గా కనిపించినా మంచి పంచ్ లతో జోక్ లు వేస్తూ సందడి చేస్తుంటారట.

సీనియర్ ఎన్టీఆర్ తో ఆయన చాలా సన్నిహితంగా ఉండేవారు. ఎన్టీఆర్ వెంకటేశ్ ను విపరీతంగా అభిమానించే వారు కూడా. నటనలో ఎన్టీఆర్ దగ్గరి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని వెంకటేశ్ చెప్పడం మనం వినే ఉంటాం.

విలక్షణ నటుడు విక్టరీ

సినిమాల సెలక్షన్లో వైవిద్యంగా ఉంటారు వెంకటేశ్. ఇండియన్ సీని ఇండస్ర్టీలో బాగా గుర్తింపు ఉన్న ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు కొడుకే వెంకటేశ్. ఆయన కుమారుడిగి ఇండస్ర్టీలోకి వచ్చినా తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు వెంకటేశ్. కుటుంబ కథా చిత్రలను ఎంచుకోవడం ఆయన స్పెషాలిటీ అనే చెప్పాలి. దీంతో పాటు సోలో హీరోల పాత్రల్లో కూడా ఆయన మెప్పిస్తూ వస్తున్నారు. ప్రేమకథా చిత్రాలు ఇలా అన్ని కోణాల్లో వచ్చిన చిత్రాల్లో ఆయన ఆడియన్స్ ను అలరించారు.

వివాదాలకు దూరంగా విక్టరీ

వివాదాలకు విక్టరీ ఎప్పుడూ దూరంగానే ఉంటారు. ఇండస్ర్టీలో అతి తక్కువ వివాదాలు ఎదుర్కొన్న వారి లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారాయన. ఆయనకూ ఒక హీరోయిన్ కు మాత్రం ఒక సమయంలో వివాదం జరిగింది. ఆ కారణంగా ఇప్పటి వరకూ ఆయన ఆ హీరోయిన్ తో మాట్లాడడం లేదట. ఆమె ప్రస్తుతం పొలిటికల్ గా చక్రం తిప్పుతున్నట్లు కూడా తెలుస్తోంది. వెంకటేశ్ కు మంచి స్టార్ డమ్ ఉంది.

ఆయన చిత్రాలు వరుస హిట్లు పడుతున్న సమయంలో సదరు హీరోయిన్ తో ఓ డైరెక్టర్ ఒక సినిమా ప్లాన్ చేశాడు. కథకు కూడా వెంకటేశ్ తో పాటు ఆ హీరోయిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సెట్స్ పైకి మాత్రం ఆ హీరోయిన్ రాలేదు. ఇందులో వెంకటేశే కావాలని తనను తప్పించి ఉంటాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిందట. అయితే అప్పటి సమయంలో వెంకటేశ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది కూడా.

ఆ ప్రాజెక్ట్ లో కొనసాగనందుకే

సదరు హీరోయిన్ తనను ఆ ప్రాజెక్టు నుంచి తప్పించేలా వెంకటేశే ప్లాన్ చేశాడంటూ ఆమె ఆరోపించింది. దీంతో వెంకీ మామకు ఫోన్ చేసి ఎడా పెడా మాట్లాడిందట. దీంతో వెంకటేశ్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమా అంటూ హీరో, హీరోయిన్ ఉంటే సరిపోదు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా కావాలి. నిన్ను అందులో నుంచి ఎందుకు తీసేశారో వారినే అడుగు నాపై ఇలాంటి ఆరోపణలు చేయవద్దు. అంటూ హెచ్చరించాడట.

అప్పటి నుంచి సదరు హీరోయిన్ తో ఇప్పటి వరకూ వెంకటేశ్ మాట్లాడడం లేదట. వారి మధ్య ఇప్పటికీ వార్ నడుస్తూనే ఉంది. వారిని కలిపేందుకు ఇండస్ర్టీలో ఎవరూ సాహసం చేయలేదట. ఎందుకంటే ఆమె చాలా మొండిదని అప్పటికీ టాక్ ఉంది కాబట్టి. ఇక భవిష్యత్ లో అయినా వారు మాట్లాడుకుంటారేమో చూడాలి మరి.