రోజులు దగ్గరపడే కొద్దీ బిగ్ బాస్ హౌజ్ టెన్షన్ పెడుతోంది. ప్రతీ వారం ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. టాప్ 5 కంటెస్టెంట్స్ పై నాగ్ ఓ హింట్ ఇచ్చాడు. ఇది ఆడియన్స్ ను మరింత గ్రాబ్ చేసింది. తెలుగు బిగ్ బాస్ సీజన్-6 నుంచి ఈ వారం (ఆదివారం) ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న ఒక్క జంటను కూడా విడదీశాడు. మదర్ ఇండియాగా గుర్తింపు సంపాదించుకున్న మెరీనా హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లో 9 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. మెరీనా ఎలిమినేషన్ తో రోహిత్ ధు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు.
నాగార్జున హౌజ్ లో ఎగ్జైటింగ్
ఆమె కూడా బాగా ఎమోషనల్ అయ్యింది. ఎలిమినేషన్ ముందు నాగార్జున హౌజ్ లో ఎగ్జైటింగ్, ఎంజాయ్ గేమ్స్ ఆడించాడు. ఇందులో భాగంగా ఒక్కొక్కరిని బాక్స్ లోకి పిలిచి టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు. బాటమ్ లో ఎవరు ఉండబోతున్నారని హౌజ్ మేట్స్ అభిప్రాయాలు తెలుసుకున్నారు. అందరూ రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్యలు టాప్ 5లో ఉండబోతున్నట్లు చెప్పారు. ఇక బాటమ్ లో ఉన్నది రాజ్, ఇనయా, మెరీనా, కీర్తి, రోహిత్ ఇందులో మెరీనా ఎలిమినేట్ అయ్యింది.
ప్యూర్ కాదని చెప్పి బయటకు వచ్చింది
అందరూ మంచి ఫర్మార్మెన్స్ ఇవ్వకుండా వారు వీరుగా, వీరు వారుగా అయ్యే ఛాన్స్ ఉంటుందంటూ నాగార్జున హెచ్చరించారు. బయటకు వస్తున్న మెరీనాకు బిగ్ బాస్ హౌజ్ లో ప్యూర్ ఎవరు అని టాస్క్ ఇవ్వగా.. రోహిత్ ఆదిరెడ్డి, రాజ్, రేవంత్, కీర్తి అని సూచించింది. మిగిలిన వారు ప్యూర్ కాదని చెప్పి బయటకు వచ్చింది మెరీనా.